Daily Horoscope
✕

వేరుశెనగలో ఏముంది...? పప్పులు తింటే ఏమిటి...? నూనె వాడితే ఏంటి?

Updated: బుధవారం, 7 నవంబరు 2018 (18:00 IST)
వేరుశెనగ వల్ల వంటకాలకు రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. మాంసాహారంలో లభించే మాంసకృత్తులన్నీ అంతే మోతాదులో లభించే ఈ వేరుశెనగ.. గుడ్డు కంటే రెండున్నర రెట్ల మాంసకృత్తులను అధికంగా అందిస్తుంది. వేరుశెనగలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులతో పాటు.. క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, జింక్, బోరాన్‌లు పుష్కలంగా లభిస్తాయి. అంతేగాకుండా వీటిని ఆహారంగా తీసుకోవటంవల్ల విటమిన్‌-ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. 
 
అయితే ఇందులో కొవ్వు శాతం కాస్త ఎక్కువ కాబట్టి క్యాలరీలూ అంతేస్థాయిలో ఉంటాయని అర్థం చేసుకోవాలి. పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తుల పాత్ర అత్యంత కీలకం. అందుకే పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉండే పిల్లలకు వేరుశనగను మించిన ఔషధం లేదు. అదేవిధంగా గర్భిణులకు, పాలిచ్చే తల్లులకూ మాంసకృత్తులు వీటినుంచి సమృద్ధిగా లభిస్తాయి. వేరుశెనగతో రోగ నిరోధక శక్తి పటిష్టం అవుతుంది. 
 
వేరుశెనగలో ఉండే రెస్వెరప్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండె జబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ సుగుణాలుంటాయి. శరీరానికి మంచి చేసే మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ 50 శాతం మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది, అంతేగాకుండా కొలస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు, ఆర్థరైటిస్ నివారణలో సైతం వేరుశెనగ పప్పు చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. 
 
ఇది పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేందుకు తోడ్పడుతుంది. వీటిలో సుమారు 70 శాతం శాచురేటెడ్‌, 15 శాతం పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉన్నప్పటికీ మోనోఫ్యాట్స్‌ వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఈ పప్పులోని ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పప్పుతో పాటు వేరుశెనగ నూనె కూడా మంచిదే. అయితే ఇందులో కేవలం ‘ఇ’ విటమిన్‌ మాత్రమే ఉంటుంది.
 
ప్రతి రోజూ సుమారు 25 గ్రాముల వేరుశెనగపప్పును ఏదో ఒక రూపంలో పిల్లలకు అందివ్వచ్చు. వీటిలో కొవ్వుశాతం కాస్త ఎక్కువ కాబట్టి, మోతాదు మించి తీసుకోకూడదు. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ తీసుకోవాల్సిన కెలోరీల్లో కొన్నింటిని మానేసి బదులుగా మాత్రమే వేరుశెనగను ఎంచుకోవాలి. లేదంటే చిన్న చిన్న సమస్యలు తప్పవు. అయితే.. కొంతమందికి వేరుశెనగ పడదు. దీన్ని తిన్నవెంటనే ఎలర్జీ వస్తుంది. అలాంటివారు వెంటనే మానేయడం మేలు. పప్పు మాత్రమే కాకుండా, ఇలాంటివారు వేరుశెనగ నూనె కూడా వాడకపోవటం ఉత్తమం.

అన్నీ చూడండి

నవంబర్ 6, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..

వైఎస్ అనిల్ కుమార్తె పెళ్లిలో సతీ సమేతంగా కేటీఆర్, జగన్: సీఎం విజయ్‌తో త్రిష

జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ భాగస్వామ్యం

తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. సుప్రీం

వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది.. అంతే ఆవేశంతో ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి

అన్నీ చూడండి

Sai Durga Tej: అంగరంగ వైభవంగా సాయి దుర్గా తేజ్, కిరణ్ నిశ్చితార్థం

జాన్వీ, రాధికా ఆప్టేలపై రెజీనా ఫైర్.. అసౌకర్యంగా అనిపిస్తే తప్పుకోండి.. అంతేకానీ సినిమా ఇండస్ట్రీలో..?

Kazakhstan; యాక్షన్ సీక్వెన్స్, స్పెషల్ సాంగ్ కోసం కజకిస్థాన్‌ వెళ్ళిన జనవరి 12 విడుదల టీమ్

Rajamouli: రామాయణం ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ నాకు ఎంతగానో నచ్చాయి : రాజమౌళి

Allu Arjun : ముంబై విమానాశ్రయంలో అల్లు అర్జున్ స్టైలిష్‌గా, పవర్‌ప్యాక్డ్ లుక్‌తో మెరిశారు

తర్వాతి కథనం
Show comments