శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:12 IST)

శారీరక శ్రమ లేకుంటే గోవిందా... ఒబిసిటీ, మతిమరుపుకు చెక్ పెట్టాలంటే?

కంప్యూటర్ల ముందు గంటల గంటలు కూర్చోవడం.. కాసేపు విరామం దొరికినా స్మార్ట్ ఫోన్లను చూస్తూ కాలం గడపడం.. సమయం ఉన్నా కూడా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే చోట ఫేస్ బుక్‌లు, వాట్సాప్‌లకు అలవాటు పడి కదలక

కంప్యూటర్ల ముందు గంటల గంటలు కూర్చోవడం.. కాసేపు విరామం దొరికినా స్మార్ట్ ఫోన్లను చూస్తూ కాలం గడపడం.. సమయం ఉన్నా కూడా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే చోట ఫేస్ బుక్‌లు, వాట్సాప్‌లకు అలవాటు పడి కదలకుండా ఉండిపోవడం ద్వారా ఊబకాయం తప్పుదు. ప్రస్తుతం ప్రపంచ జనాలంతా ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్నారు. ఈ ఫాస్ట్ లైఫ్‌లో వ్యాయామం చేయడానికి తీరిక ఉండట్లేదు. ఒక వేళ ఉన్నా.. వ్యాయామం, శారీరక శ్రమతో కూడిన పనుల్ని చేసేందుకు చాలామంది ఇష్టపడట్లేదు. 
 
ఆఫీసుకు వెళ్ళామా ఇంటికొచ్చామా.. ఏదో సినిమా చూశామా.. ఇంకా టైముంటే స్మార్ట్ ఫోన్లు చూస్తూ కూర్చుండిపోయామా అని చాలామంది కాలం గడుపుతున్నారు. అయితే వ్యాయామం లేకపోతే.. అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు  హెచ్చరిస్తున్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ లేని కారణంగా ఊబకాయం బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.3 మిలియన్ల మంది చనిపోతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 
 
శారీరక శ్రమ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించే వారిలో ఒబిసిటీతో పాటు మతిమరుపు పూర్తిగా తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకుంటే మతిమరుపు దూరం కావడంతో పాటు చురుకుదనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయని వారు సెలవిస్తున్నారు.