శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (18:00 IST)

బీపీ వ్యాధితో బాధపడేవారు సబ్జాగింజలు తీసుకుంటే?

సబ్జా గింజలను ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకుని ఆ నీటిని త్రాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయి. మహిళలకు తప్పకుండా కావలసిని ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసి విటమిన్ ఇ కూడా ఇందులో లభిస్తుంది. ఈ విత్తన

సబ్జా గింజలను ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకుని ఆ నీటిని త్రాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయి. మహిళలకు తప్పకుండా కావలసిని ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసి విటమిన్ ఇ కూడా ఇందులో లభిస్తుంది. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.
 
అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగ కడుపునిండిన భావన కలిగి మాటిమాటికీ ఆకలేయదు. జిగురులా ఉండే ఈ సబ్జా గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉన్నాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి. కేవలం శరీరం లోపలి భాగన్నే కాకుండా బయట భాగాన్ని కూడా కాపడటంలో ఇవి బాగా పనిచేస్తాయి.
 
ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెలో కలిపి గాయాలకు, పుండ్లపై రాసుకుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకుని అవి ఉబ్బిన తరువాత త్రాగితే ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. మానసికంగా ప్రశాతంగా ఉంటారు. 
 
రక్తాన్ని శుద్ధి చేయడంలో శరీరంలోని మలినాలను తొలగించడానికి సబ్జా గింజలు చాలా ఉపయోగపడుతాయి. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనెవేసి నానబెట్టిన సబ్జా గింజలలో కలుపుకుని తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలనుండి దూరంగా ఉండవచ్చును. 
 
గొంతులో మంట, ఆస్తమా. జ్వరం వంటి సమస్యలకు సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తీసుకుంటే వీటినుండి విముక్తిచెందవచ్చును. బీపీ అదుపులో ఉండాలంటే ఈ గింజలు తీసుకుంటే మంచిది. వీటిలో ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వలన హృదయ సంబంధిద సమస్యలు రాకుండా ఉంటాయి.