నువ్వుల నూనె మహిళలకు ఎలా మేలు చేస్తుందో తెలుసా?
మహిళలను వేధిస్తున్న సమస్యల్లో ఒకటి అధిక బరువు. జంక్‌ఫుడ్ కారణంగా ఊబకాయం వచ్చేస్తోంది. పోషకాహారంపై దృష్టి పెట్టకపోవడంతో పాటు వ్యాయామానికి దూరంగా ఉండడం ద్వారా ఒబిసిటీ వస్తోంది. అధిక బరువు చేరకుండా ఫిట్‌గా వుండేందుకు అనుసరించాల్సిన ఏమిటో తెలుసుకుందాము.
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే ఉద్యోగాల్లో ఉన్న మహిళలు తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయకుంటే కీళ్ళ నొప్పులు, షుగర్, గుండె జబ్బులతో ఇబ్బందులు తలెత్తుతాయి కనుక శారీరక శ్రమ తప్పకుండా వుండాలి. స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది.
ఉదయం పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగి ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి కనుక బీపీ కంట్రోల్ అవుతుంది. కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది. నువ్వుల నూనెలో విటమిన్ ఈ, బిలు ఉండటం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.