స్మార్ట్‌ఫోన్‌ల వల్ల ఎంత నష్టమో తెలుసా? బ్లూలైటే ముంచేస్తోంది..

సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:04 IST)
ఈ కాలంలో స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్లెట్ల వినియోగం ఎక్కువైపోయింది. ఎవరి చేతుల్లో చూసినా అవే కనిపిస్తున్నాయి. వాటికి బాగా అడిక్ట్ అయిపోయారు. అయితే వీటిని ఎక్కువగా వినియోగించినట్లయితే వాటి నుండి వెలువడే బ్లూ లైట్ వలన కంటికి ముప్పు తప్పదు. స్మార్ట్ ఫోన్ తయారీలో బ్లూలైట్ ఉపయోగిస్తారు. రాత్రి పూట నిద్ర రావడానికి కారణం ఆ సమయంలో శరీరంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్.
 
ఈ హార్మోన్ సాయంత్రం నుంచి శరీరంలో మెల్ల మెల్లగా విడుదల అవుతుంది. అయితే రాత్రి పూట స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే దాని నుండి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా మెలటోనిన్ విడుదల తగ్గుతుంది.
 
అందుకే నిద్రలేమి సమస్య వస్తుంది. రాత్రిపూట స్మార్ట్ ఫోన్‌ల వినియోగం అంత మంచిది కాదు. నిద్రకు ఉపకరించే గంట ముందు స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లను దూరంగా ఉంచితే కంటికి, మెదడుకు విశ్రాంతి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ఒకవేళ ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే బ్లూ లైట్‌ని ఆటోమేటిక్ నియంత్రించేలా సెట్ చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే గంట ముందు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ దూరంగా వుండటం ద్వారా కంటికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చినవారమవుతామని వైద్యులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

విజయవాడలో దసరా నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు

ఇరాన్ ట్రైలర్ మాత్రమే చూసింది.. ముందుంది అసలు సినిమా : డోనాల్డ్ ట్రంప్

విజయనగరం జిల్లాల్లోకి అడవి ఏనుగుల గుంపు.. భయం భయం

గత పాలకులు చేసిన తప్పులు నిలదీస్తున్నందే ప్రశ్నల వర్షం : సీఎం రేవంత్

కరీంనగర్‌లో భారీ దోపిడీ.. 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21లక్షలు ఎత్తుకెళ్లారు..

అన్నీ చూడండి

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

తర్వాతి కథనం
Show comments