ganesh chaturthi

వేసవిలో హాయిగా 10 గంటలు నిద్రపోతే..?

Written By సెల్వి
Updated: సోమవారం, 30 మార్చి 2020 (11:18 IST)
వేస‌విలో స‌హ‌జంగానే చాలా మందికి వేడి చేస్తుంటుంది. అలాంటి వారు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అంజీర్ పండ్ల‌ను తింటే శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వేడి త‌గ్గుతుంది. హైబీపీతో బాధ‌ప‌డేవారు నిత్యం అంజీర్ పండ్ల‌ను తినాలి. వీటిలోఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. అంజీర్ పండ్ల‌లో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను పోగొడుతుంది. 
 
అంజీర్ పండ్ల‌ను తింటే నిద్ర‌లేమి స‌మ‌స్య పోతుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. అలాగే డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. అంజీర్ పండ్ల‌ను తినడం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.
 
అలాగే వేసవిలో రోజుకు పది గంటల పాటు హాయిగా నిద్రపోవాలి. రోజుకి ఎనిమిది నుంచి పదిగంటల పాటు నిద్రపోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సరిపడ నిద్రపోవడం వలన హార్మోన్లు సమతుల్యం అవుతాయి. రోజు మొత్తం మీద ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి నీరు మందుగా పని చేస్తుంది.
 
ముఖ్యంగా పోషకాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించు కోవచ్చు. విటమిన్లు, మినరల్స్‌ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మినరల్స్‌ అధికంగా లభించే చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, గింజలు, విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండే గుడ్లు, లివర్‌, బిటాకెరోటిన్‌ ఉండే పాలకూర, చిలగడదుంప, క్యారెట్‌ వంటివి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments