Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తుమ్ము ఎందుకు వస్తుందో తెలుసా..?

Written By సందీప్
Updated: శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:09 IST)
ముక్కులో దురద పుట్టినా, దుమ్ము ధూళి పీల్చినా, జలుబు చేసినా మనకు తుమ్ములు వస్తాయి. తుమ్మినప్పుడు పెద్దలు నూరేళ్లు వర్ధిల్లు అని దీవిస్తారు. దానికి కారణం తుమ్మిన‌ప్పుడు మ‌న గుండె సెక‌న్లో చాలా త‌క్కువ వంతు (మిల్లీ సెకండ్‌) స‌మ‌యం పాటు ఆగిపోతుంద‌ని చెబుతారు. కానీ దీనిలో ఎంత మాత్రం నిజం ఉంది? దీనిపై పరిశోధకులు ఏమి చెబుతున్నారో చూద్దాం. 
 
తుమ్మితే గుండె ఆగుతుందనేది అపోహ మాత్రమే. తుమ్మినప్పుడు గుండె అస్సలు ఆగదు. ఈ విష‌యాన్ని ప‌రిశోధ‌న‌లు చేసిన సైంటిస్టులు, వైద్యులే చెబుతున్నారు. తుమ్మిన‌ప్పుడు అస‌లు గుండె ఆగిపోయే అవ‌కాశ‌మే లేద‌ట‌. కాక‌పోతే గుండె కొట్టుకునే రేటులో స్వ‌ల్ప మార్పు వ‌స్తుంద‌ట‌. అయితే తుమ్ముకు సంబంధించి ప‌లు వ‌ర్గాల‌కు చెందిన వారు న‌మ్మే విష‌యాలు కొన్ని ఉన్నాయి. 
 
అవేమిటంటే ఆంగ్లేయులు తుమ్ముకు సంబంధించి ఓ విశ్వాసాన్ని పాటిస్తారు. ఎవరైనా తుమ్మినప్పుడు గాడ్ బ్లెస్ యు అని అంటారు. దీనికి ఓ కథ ప్రచారంలో ఉంది. మునుపు వారు ఉన్న ప్రాంతంలో వింత వ్యాధి వచ్చిందట. అది సోకిన వారు ఎక్కువగా తుమ్మేవారు. దాంతో అప్పట్లో పోప్‌లు తుమ్మిన వారిని గాడ్ బ్లెస్ యు అని దీవించే వారు. అలా చేస్తే వ్యాధి త్వరగా నయం అవుతుందని వారి నమ్మకం. అప్పటి నుండి దీన్ని పాటిస్తున్నారు. 
 
ఇక తుమ్మిన‌ప్పుడు మ‌నలో ఉండే దుష్ట‌శ‌క్తులు పోతాయ‌ని కొన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు న‌మ్ముతారు. తుమ్మిన వ్యక్తిలో నుండి వచ్చే దుష్ట శక్తులు ఎదుటివారిలోకి ప్రవేశించకుండా ఉండేందుకు దేవున్ని తలుచుకుంటారు. ఈ ఆచారం పాటించే వారు ఇప్పటికీ ఉన్నారు. తుమ్ము గురించి మనం తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. తుమ్ము నుండి వచ్చే గాలి వేగం గంటకు 160 కిమీ ఉంటుంది.

ఏ వ్యక్తీ నిద్రలో తుమ్మడం సాధ్యపడదు. ఎందుకంటే నిద్రిస్తున్నప్పుడు తుమ్ములకు కారణమయ్యే నాడీ కణాలు కూడా విశ్రాంతి దశలో ఉంటాయి. వెంట‌నే తుమ్ము రావాలంటే ముక్కులో ఈక‌ లాంటిది పెట్టుకోవాలి. లేదంటే క‌నుబొమ్మ‌ల‌పై ఉండే వెంట్రుక‌ల‌ను పీకినా తుమ్ములు వ‌స్తాయి.

అన్నీ చూడండి

Weather forecast: October 14, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ఈ పీట నాకెందుకండీ అంటూ దుర్గ గుడిలో కింద కూర్చున్న సీఎం విజయ్, వీడియో

చిటికెలో నా ఉద్యోగం ఊడింది, మీ ఉద్యోగం వుంటుందో లేదో: అమెరికా నుంచి టెక్కీ వీడియో

విజయవాడలో సీఎం విజయ్ మానియా.. వైరల్ అవుతున్న వీడియోలు.. ఫోటోలు

దేశంలో స్టార్ లింక్ అనుమతులు నిలిపివేయాలి : స్వదేశీ జాగరణ్ మంచ్

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments