శనివారం, 24 జనవరి 2026
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:07 IST)

వారిని నలుగురిలో చూలకన చేస్తే.. ఏమవుతుంది..?

పిల్లలంటే రోజంతా అరుస్తూ, వాగుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇల్లు పీకి పందిరేస్తారు. కానీ వీళ్లంతా ఒకరకం అయితే మరికొందరు తమ అంతరంగాన్నీ, ఇష్టాయిష్టాలను దాచేసుకుంటారు. వీళ్ల గురించి ఓసారి తెలుసుకుందాం..
 
అంతర్ముఖులుగా ఉండే పిల్లల్లో భావోద్వేగాలు కాస్త ఎక్కువగానే ఉంటాయట. వాటిని నియంత్రించే క్రమంలోనే తల్లిదండ్రులుగా మీ సాయం అవసరమవుతుంది. అందువలన వీలైనంతవరకు వారిని ఇతరులతో పోల్చడం, వెక్కిరించడం, పేర్లు పెట్టడం, ముఖ్యంగా నలుగురిలో చులకన చేయడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వలన వారు మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. 
 
చాలామంది చిన్నారులకు వినే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అదే.. విషయాలను ఒంటపట్టించుకునే నైపుణ్యాన్ని ఇస్తుంది. అందుకు తగ్గట్టుగా భావవ్యక్తీకరణా వీరికి తోడైతే అద్భుతాలు సాధించొచ్చు. కనుక వీలైనంతవరకు చిన్నారులకు నలుగురిలో మాట్లాడే అవకాశాన్ని తరచు కల్పించాలి. వారు మాట్లాడే తీరును ప్రశంసించడం, ఎలా మాట్లాడాలో సూచించడం వలన వారు అన్ని విషయాల్లోనూ మరింత పట్టు సాధించగలుగుతారు.