శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (10:16 IST)

పిజ్జా బాగోలేదనీ... యజమాని మొహంపై పడేసిన మహిళ

బాగా ఆకలి అవుతుండటంతో పిజ్జా తిందామని దగ్గర్లోని షాపుకెళ్లి పిజ్జాను ఆర్డరిచ్చిందో ఓ మహిళ. తీరా ఆ పిజ్జా ఆరగించబోయే సమయానికి అది చెడిపోయివుంది. ఇదేంటని షాపు యజమానిని నిలదీస్తే.. అతని దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆ పిజ్జాను యజమాని మొహంపై పడేసిందా మహిళ. దీనిపై ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫ్లోరిడాకు చెందిన 28 ఏళ్ల సైదా సలీమ్ అనే మహిళ తన కుమారుడుతో కలిసి ఓషాపుకెళ్లి మార్గరెటా పిజ్జా ఆర్డరిచ్చింది. కానీ, షాపు సిబ్బంది ఆమె కోరిన పిజ్జాను సర్వే చేయకుండా సాధారణ పిజ్జాను సర్వ్ చేశారు. పైగా, అది చెడిపోయివుంది. 
 
దాన్ని చూసి సైదా.. ఇదేంటని ప్రశ్నించింది. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో యజమానిని నిలదీసింది. ఆయన వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పిజ్జాను ఆయన మొహంపై విసిరేసింది. ఈ సంఘటనపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.