మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (12:55 IST)

ఆ కాయలు తింటే బరువు తగ్గడమేకాదు అందం కూడా మీ సొంతం

వేరుశనగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఆహారం. ముఖ్యంగా శక్తితో పాటు అందం, ఆరోగ్యాన్ని కూడా సమకూర్చుతుంది. ఇందులోని పోషకాలు, కార్పొహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తిని సమకూర్చుతాయి. అలాగే, విటమిన్ బీ3, విటమిన్-ఈ కారణంగా శరీరానికి మంచి మెరుపు వస్తుంది. 
 
అంతేకాకుండా, తక్షణ బరువు తగ్గాలనుకునేవారు వేరుశనక్కాయలు తినడం మంచిది. ఇది మధుమేహాన్ని కూడా నివారిస్తుంది. తాజా అధ్యయనం మేరకు వేరుశనక్కాయలు తినేవారిలో డయాబెటిస్‌ వచ్చే ముప్పు 21 శాతం తగ్గుతుందని తేలింది. ఈ కాయల్లో ఉండే మాంగనీస్‌ దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా, గాలిబ్లాడర్‌లో వచ్చే రాళ్లను కూడా వేరుశనక్కాయలు తగ్గిస్తాయని మరో అధ్యయనంలో తెలిసింది. వేరుశనక్కాయల్లో విటమిన్‌ బి కాంప్లెక్స్‌లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్‌ చాలా ఎక్కువ. అవి గర్భవతులకు మేలుచేస్తాయి. ఇక విటమిన్‌ - బి3గా పిలిచే నియాసిన్‌ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది. మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువ. వాటి కారణంగా మంచి రోగనిరోధకశక్తి లభిస్తుంది. ఈ ఇమ్యూనిటీ కారణంగా మరెన్నో జబ్బులూ నివారితమవుతాయి.