మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (17:07 IST)

మేకపాలలో ఖర్జూర పండ్లను నానబెట్టుకుని ఆరగిస్తే...

ఆవుపాల మాదిరిగానే మేకపాలు తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. పోషక గుణాలు పుష్కలంగా ఉండే మేకపాలను తాగడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యలు మటుమాయంకావడమే కాకుండా లైంగికపటుత్

ఆవుపాల మాదిరిగానే మేకపాలు తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. పోషక గుణాలు పుష్కలంగా ఉండే మేకపాలను తాగడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యలు మటుమాయంకావడమే కాకుండా లైంగికపటుత్వం కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇపుడు ప్రోటీన్స్, కాల్షియం ఎక్కువ ఉండే మేకపాలను తాగడం వల్ల కలిగే ఉపయోగాలేమిటో ఓసారి తెలుసుకుందాం.
 
* మేకపాలతో కణాల వృద్ధి త్వరితగతిన సాగుతుంది.
* రక్తహీతనకు మేకపాలు ఓ దివ్యౌషదంగా పని చేస్తుంది. 
* ఆవుపాలతో పోల్చుకుంటే మేకపాలు తొందరగా జీర్ణమవుతాయి. 
* మహాత్మగాంధీ మేకపాలను ఎక్కువగా తాగడానికి కూడా ఓ కారణం ఉందట. 
* ఎముకల పటిష్టతకు, కీళ్ల నొప్పుల నివారణకు మేకపాలు ఎంతో ఉపయోగపడతాయి. 
* ఒక కప్పు మేకపాలు తీసుకోవడం వల్ల 35 శాతం ఫ్యాటీ ఆమ్లాలను శరీరం అధికంగా పొందుతుంది.
* డెంగ్యూ సోకినవారి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. ఇలాంటివారికి మేకపాలను తాగిస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. 
*మేకపాలల్లో ఖర్జూర పండ్లను నానబెట్టుకొని తింటే.. లైంగిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా పురాణాల్లో పేర్కొనడం జరిగింది.
* మేకపాలలో ట్రైటోఫాన్‌ అనే ఎమినో యాసిడ్స్‌ చాలా పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సక్రమంగా అందుతాయి.