గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:04 IST)

కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైములు, ఎమినో యాసిడ్‌లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. వీటి ఉపయోగాలేమిటో చూద్దాం. 1. కొబ్బరినీళ్లు తాగడం వలన ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది. చక్కెర స్

కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైములు, ఎమినో యాసిడ్‌లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. వీటి ఉపయోగాలేమిటో చూద్దాం.
 
1. కొబ్బరినీళ్లు తాగడం వలన ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది. చక్కెర స్థాయిలను నియంత్రించి మంచి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
 
2. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగపడుతాయి.
 
3. కొబ్బరి నీళ్లలో ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని కూడా బాగా తగ్గిస్తుంది.
 
4. మెుటిమలు, మచ్చలు, ముడతలు, చర్మం సాగిన గుర్తులు, తామర వంటి వాటిపై కొబ్బరి నీళ్లను రెండుమూడు వారాల పాటు రాస్తూ వుంటే, అది చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
 
5. కొబ్బరినీళ్లు వృద్దాప్య నివారణ, క్యాన్సర్ తగ్గించే కారకాలు, రక్త ప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటోకినిన్లను కలిగి ఉంటాయి. కొబ్బరి నీళ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.    
 
6. కొబ్బరి నీళ్లలో రిబోప్లావిన్, థయామిన్, బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరమవుతాయి.