భారతదేశంలో పాలంటే కేవలం ఆహారం లేదంటే పోషణకు అవసరమైన ఓ పదార్థం మాత్రమే కాదు అది ఓ జీవన విధానం. వేడుకలు, నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కడైనా సరే పాలను వినియోగించాల్సిందే. ఇటీవల విడుదలైన ఓ సమాచారం ప్రకారం గత మూడు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తి 59%కు పైగా వృద్ధి చెందింది.
1988లో 530 మిలియన్ టన్నులుగా ఉంటే 2018 నాటికి అది 843 మిలియన్ టన్నులకు చేరింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశాలలో ఇండియా అగ్రగామిగా ఉంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో 22% ఇక్కడ జరుగుతుంది. ప్రపంచంలో గేదె పాలను దాదాపు 80% ఇండియా, పాకిస్తాన్‌లు ఉత్పత్తి చేస్తుంటే వాటిని అనుసరించి చైనా, ఈజిప్ట్, నేపాల్ ఉన్నాయి.
సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకులు, సీఈవో కిశోర్ ఇందుకూరి మాటల్లోనే చెప్పాలంటే ఉత్పత్తిదారునిగా మాత్రమే కాదు వినియోగం పరంగా కూడా ఇండియా అత్యధికంగా పాలను వినియోగిస్తుంటుంది. భారతదేశంలో విరివిగా లభించేది మరియు ఎక్కువగా వినియోగించేది కూడా పాలనే. చిన్నారులతో పాటుగా వృద్ధుల కోసం ఆవు పాలు ఇప్పటికీ ఎక్కువ మంది కోరుకునే పాల రకం అయితే మిగిలిన వారు గేదె పాలపైనే ఆధారపడుతుంటారు.
ఇక చరిత్ర పరంగా చూస్తే ఆవుపాలను నేరుగా పిల్లలు, పెద్దలు తాగుతుంటారు. అయితే స్వీట్‌మీట్స్, పన్నీర్, పెరుగు, ఐస్‌క్రీమ్ లాంటి పదార్థాల వినియోగంలో గేదె పాలను ఎక్కువగా వాడుతుంటారు. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో కొలెస్ట్రాల్ శాతం కూడా ఎక్కువ. కారణం చేతనే పీసీఓడీ, హైపర్‌టెన్షన్, కిడ్నీ వ్యాధులు, ఉబకాయం ఉన్నవారికి ఆవుపాలు మంచిది. ఆవు పాలు అయినా గేదె పాలు అయినా ఆరోగ్యవంతమైన ఆహారం పాలు. ఆవుపాలలాగానే గేదె పాలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి మరియు వీటితో వెన్న, పెరుగు, చీజ్, ఐస్‌క్రీమ్‌లు తయారుచేస్తారు.
ఒకవేళ ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే, వారు గేదె పాలు తాగడం వల్ల కడుపు నిండిందన్న భావనలోకి వస్తారు. ఇది వారు తీసుకునే ఆహార పరిమాణంపై రోజంతా ప్రభావం చూపడంతో పాటుగా శరీర కొవ్వుపై కూడా ప్రభావం చూపుతుంది. ఇదే రీతిలో ఎవరైనా తాము తీసుకునే కొవ్వుశాతం తగ్గించుకోవాలనుకున్నా లేదంటే లాక్టోజ్ వస్తువులు తమ ఒంటికి సరిపడవనుకున్నా వారు ఆవు పాలను తీసుకోవచ్చు.
ఈ రెండు రకాల పాలూ ఆరోగ్యానికి మంచివే. ఆరోగ్య ప్రయోజనాల పరంగా వేటికవే సాటి. అందువల్ల, ఏ పాలు తాగాలనేది ఆ వ్యక్తుల వ్యక్తిగత ప్రాధాన్యతను అనుసరించి ఉంటుంది. కాకపోతే మీ రోజువారీ డైట్‌లో పాలును భాగం చేసుకోవడం మాత్రం మరువద్దు. ఈ పాలు తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయో చూద్దాం.
ఆవు పాలు
ఆవుపాలలో కాల్షియం, విటమిన్ డీ, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి.
9 అత్యవసర అమినో యాసిడ్స్ ఆవు పాలలో ఉంటాయి.
రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటుగా గాయపడిన కణాలు, కణజాలానికి తగిన చికిత్సను అందిస్తుంది.
ఎముకలు మరియు కండరాల వృద్ధి, నిర్వహణకు తోడ్పడతాయి.
ఆస్టియోపోరోసిస్ మరియు ఆస్టియోఆర్థరిటీస్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఎదిగే పిల్లల్లో మొత్తంమ్మీద మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది.
బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
గేదె పాలు
గేదె పాలలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఏ, పలు ఇతర పోషకాలు ఉంటాయి.
మొత్తంమ్మీద మీ గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి గేదె పాలు తోడ్పడతాయి.
ఆస్టియో పొరోసిస్, ఆర్థరిటీస్ లాంటి ఎముకల సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.
గేదె పాలలో పోటాషియం పరిమాణం కూడా అధికంగానే ఉంటుంది. రక్తపోటు స్థిరంగా ఉండేందుకు ఇది అత్యంత కీలకం.
తమ మజిల్ మాస్ పెంచుకోవాలని కోరుకునే వారికి ఖచ్చితమైన పానీయంగా గేదె పాలు నిలుస్తుంది.
పలు పోషకాలు ఉండటం చేత చర్మంకు తగిన పోషకాలు అందిస్తూనే ఆరోగ్యవంతంగానూ ఉంచుతుంది.