శని ప్రదోషం... పూజ.. అభిషేకాది వివరాలు
ఏకాదశి రోజున మహాశివుడు విషాన్ని తీసుకున్నాడు. ద్వాదశి రోజున మహాశివుడు నీలకంఠుడిగా భక్తులుగా దర్శనమిచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. అలాగే త్రయోదశి తిథి రోజున సాయంత్రం ప్రదోష కాలంలో నృత్యకారకుడైన నటరాజ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. అలా శని ప్రదోషం మహిమాన్వితమైంది.
ప్రదోషంలో రకాలు
నిత్య ప్రదోషం: రోజూ ప్రదోష సమయం సాయంత్రం 4.30 గంటల నుంచి 6.00 గంటల వరకు.
పక్ష ప్రదోషం : శుక్లపక్ష చతుర్థి కాలంలో వచ్చే ప్రదోష సమయం.
మాస ప్రదోషం: కృష్ణపక్ష త్రయోదశి కాలంలో ప్రదోష సమయంలో శివునిని ఆరాధించడం.
మహా ప్రదోషం: శనివారంలో త్రయోదశి తిథి వచ్చినట్లైతే అదే మహా ప్రదోషం.
ప్రళయ ప్రదోషం: ప్రపంచం వినాశనానికి కారణమయ్యే సమయంలో వచ్చేది. ఈ సమయంలో ఈ ప్రపంచమంతా శివునిలో ఐక్యమవుతుంది.
శనిప్రదోషం పూజ.. అభిషేక వస్తువులు
పుష్పాలు - దైవానుగ్రహం
పండ్లు - ధనధాన్యాల వృద్ధి
చందనం - దైవశక్తి
పంచదార - శారీరక బలం
తేనె - మంచి గాత్రం
పంచామృతం- సిరిసంపదలు
నువ్వుల నూనె - సుఖ జీవనం
కొబ్బరి నీరు- సత్సంతానం
పాలు- వ్యాధులు దరిచేరవు.. ఆయుర్దాయం పెరుగుతుంది
పెరుగు - సకల శుభాలు
నెయ్యి - ముక్తి దాయకం.