గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

ఆంజనేయ స్వామిని ఏ రోజున ప్రార్థించాలి...?

Hanuman
ఆంజనేయ స్వామిని ప్రతి రోజూ ప్రార్థించవచ్చు. అలా కుదరకపోతే.. బుధవారం, గురువారం లేదంటే శనివారం పూట హనుమంతుడిని పూజించవచ్చు. ఆంజనేయుడు వాయుపుత్రుడు. ఆయనను తమలపాకుల మాలతో పూజిస్తే సకల సంపదలు లభిస్తాయి. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. హనుమంతుడికి తులసీ మాల సమర్పిస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
హనుమంతుడికి శ్రీ రామ జయం అని రాసి మాలగా కూర్చి సమర్పిస్తే.. అన్నీ కార్యాల్లో దిగ్విజయం చేకూరుతుంది. తమలపాకు మాలతో చేపట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటివి దోషాలను ఎదుర్కొంటున్న వారు.. బుధ, గురు, శనివారాల్లో హనుమంతుడి పూజ తప్పక చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.