శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (17:32 IST)

మార్చి నెల రాబోతోంది.. బ్యాంకులకు 8 రోజులు సెలవు

మార్చి నెల రాబోతోంది. ఈ మార్చిలో మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ముఖ్యంగా మార్చిలో ఓ లాంగ్ వీకెండ్ ఉండడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చిలో 31 రోజులు ఉన్నాయి. అందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు. వీటితో పాటు మహాశివరాత్రి, హోళీ పండుగలు కూడా మార్చిలోనే వచ్చాయి. 
 
మరో రెండు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. మార్చి 7, మార్చి 14, మార్చి 21, మార్చి 28 తేదీల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. ఇక మార్చి 13న రెండో శనివారం, మార్చి 27న నాలుగో శనివారం వచ్చాయి. ఈ రెండురోజులు కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. 
 
మార్చి 11న మహాశివరాత్రి, మార్చి 29న హోళీ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మార్చి 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడతాయి. నాలుగో శనివారం, ఆదివారం, హోళీ పండుగ వరుసగా మూడురోజులు వచ్చాయి. ఈ 8 రోజులతో పాటు మరో రెండు రోజులు కూడా బ్యాంకులు మూతపడే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు.
 
 తొమ్మిది బ్యాంక్ ఎంప్లాయ్ యూనియన్లు మార్చి 15 నుంచి సమ్మెను ప్రకటించాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేపట్టనున్నాయి. దీంతో రెండు రోజుల పాటూ బ్యాంకులకు సెలవులు రానున్నాయి. బ్యాంకులు మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు దిగితే మార్చి 14న ఆదివారం వచ్చింది కాబట్టి వరుసగా మూడురోజులు బ్యాంకులు తెరుచుకోవు. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.