ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2019 (21:55 IST)

ఈ పండ్లు అప్పుడు తినకూడదు... జాగ్రత్త...

చాలామంది ఇంట్లో వున్నాయి కదా అని పండ్లను వేళాపాళా లేకుండా తినేస్తుంటారు. కానీ కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. అరటి పండును భోజనానికి ముందే తీసుకోవాలి.
 
అరటి బరువైన పండు కాబట్టి భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్న భోజనం అయ్యాక.. చాలా సేపటి తర్వాత ఈవినింగ్ స్నాక్స్‌గా అరటి పండును తీసుకోవచ్చు. 
 
బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తోసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు. పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.