Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో కిచ్ కిచ్‌గా వుందా..? ఐతే ఇలా చేయండి..

Updated: సోమవారం, 15 జులై 2019 (13:51 IST)
గొంతులో కిచ్ కిచ్‌గా వుందా.. అయితే ఇలా చేయండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. గొంతులో ఇబ్బందిగా వుంటే.. ఒక టేబుల్‌స్పూన్‌ తేనె తీసుకోవాలి. ప్రతీ మూడు గంటలకొకసారి తీసుకుంటూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు త్వరగా నయం అవుతాయి. అలాగే రోజూ క్రమంతప్పకుండా దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 
బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. దాల్చిన చెక్క పొడి చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. తేనె, దాల్చినచెక్క పొడిని సమానంగా తీసుకుని సమస్య ఉన్న చోట పూస్తే ఎగ్జిమా, రింగ్‌వార్మ్స్‌, ఇతర స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
 
ఇంకా మూడు టేబుల్‌స్పూన్ల తేనె, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని పేస్టు మాదిరిగా చేసుకుని పడుకునే ముందు ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమలు మొత్తం మటుమాయమవుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కంటే అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించి తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు.. సాధిక్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. perfumes?

నేపాల్ ఆకస్మిక వరదలు.. 45 రోజుల పసికందును కాపాడిన సైన్యం.. వీడియో వైరల్

కూకట్‌పల్లి ఐడీఎల్ లేక్ వద్ద జంటల అసభ్య ప్రవర్తన.. కళాశాల విద్యార్థులు.?

యాప్‌లో లావణ్య అంటూ పరిచయం, రూ. 14.75 లక్షలు సమర్పించుకున్న టెక్కీ

ప్రమాద స్థాయికి గంగా నది నీటి మట్టం.. వరద ముందస్తు చర్యలు ముమ్మరం

అన్నీ చూడండి

Mohanlal: మోహన్‌లాల్ - విష్ణు మోహన్ మూవీ టైటిల్ ఆపరేషన్ గంగా

అనూప్ రూబెన్స్ ముగ్గురు కోతులు చిత్రం సాంగ్ రిలీజ్

Athreyapuram Brothers,: ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రీకరణ పూర్తి

NBK111 టైటిల్ దాదా? విడుదల తేదీ అప్ డేట్ రాబోతోంది

విశ్వక్ సేన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా లెగసీ విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments