శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (17:52 IST)

పురుషుల్లో ఆ కౌంట్‌ను పెంచే చిలగడదుంప..

పురుషుల్లో సంతాన సాఫల్యతకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవాలంటే.. చిలగడదుంపను డైట్‌లో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీర్యకణాల సంఖ్యలో తగ్గుదల కారణంగా చాలామంది పురుషులు సంతానలేమితో ఇబ్బంది పడుతున్నారు. ఇలా మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుదలకు జీవనశైలిలో వస్తున్న మార్పులే ప్రధాన కారణమని సైంటిస్టులు అంటున్నారు. 
 
కానీ తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే వీర్యకణాల వృద్ధి జరుగుతుందని, ఇంకా వీర్యకణాలు వృద్ధి చేయడంలో చిలగడ దుంప బాగా పనిచేస్తుందని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. రోజు తీసుకునే ఆహారంలో స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంపను చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు. 
 
ఎందుకంటే చిలగడ దుంపలో అత్యధిక స్థాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే ప్రీ-రాడికల్ డ్యామెజ్ నుంచి చిలగడదుంప కాపాడుతుందని వారు చెప్తున్నారు.