ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 16 మార్చి 2020 (21:57 IST)

ఆహారం గురించి తొలగిపోవాల్సిన కొన్ని ముఖ్య అపోహలు, ఏంటది?

డైట్ గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. అలాంటి వారి కోసం అతి ముఖ్యమైన సమాచారం. అసలు డైట్ ఉండాలంటే ఎలాంటి వాటితో ఉంటే బెట్టర్. అవి ఏవిధంగా మీ శరీరానికి ఇబ్బంది కలిగిస్తాయి... లేకుంటే ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకోంది.
 
ముందుగా సూప్స్, సలాడ్స్ క్యాలరీల పరంగా చాలా తక్కువ. బయట హోటల్స్‌లో దొరికే సూప్స్, సలాడ్స్‌లో ఎక్కువగా కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఉంటుందట. నూడిల్స్, చికెన్, పన్నీరు వంటి వాటితో నిండి ఉంటుంది. ఒక మీల్‌గా తీసుకోవచ్చు. కానీ సూప్ తాగిన తరువాతర ఇతర ఆహార పదార్థాలు తినడం వల్ల లాభం ఏమీ ఉండదట. కాబట్టి సూప్, సలాడ్స్ ఆర్డర్ చేసేటప్పుడు క్రీమ్‌తో కూడిన డ్రస్సింగ్స్, ఇతర కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవాలి. 
 
అలాగే గోధుమల కన్నా అన్నం వల్ల చాలా త్వరగా బరువు పెరుగుతామట. గోధుమలు, బియ్యం రెండు కూడా కార్బోహైడ్రేట్స్ కానీ ఏ పిండి పదార్థం అయినాసరే ఎంత తింటున్నాము అన్నది చూసుకోవాలట. అరకప్పు ఉడికించిన అన్నం... మీడియం సైజు చపాతి, దంపుడు బియ్యం లేదా పొట్టు గోధుమపిండితో చేసిన చపాతీలు తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండా ఉంటుందట. 
 
అలాగే బఠాణీలు, క్యారెట్స్, బంగాళాదుంప వల్ల ఫ్యాట్స్ ఎక్కువవుతుంది. బఠాణీలు, క్యారెట్స్‌లో మంచి పీచుపదార్థం ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. కానీ అన్ని రకాల రంగులలో ఉన్న కాయగూరలను ప్రతిరోజు ఎంచుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ కూడా సరిపడా అందుతాయట. 
 
అలాగే బంగాళాదుంపలలో పిండిపదార్థం శాతం ఎక్కువ ఉండడం వల్ల వీటిని తీసుకున్నప్పుడు అన్నం లేదా చపాతీ మోతాదును తగ్గించుకుంటే సరిపోతుందట. వెజిటేరియన్స్‌కు మాంసకృతుల లోపాలు ఉంటాయి. అన్ని రకాల పప్పుధాన్యాలు, సోయా, సోయాతో చేసిన ఆహార పదార్థాలు, పాలు, పాల పదార్థాలు, నట్స్, గింజలు వంటివి సరైన మోతాదులో ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి కావాల్సినంత మాంసకృతులు లభిస్తాయట.