బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 10 మార్చి 2020 (21:36 IST)

మధ్యాహ్నం 2 గంటల లోపే అలాంటి ఆహారం తీసుకోవాలి

1. జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే.. అలాంటి సమస్య ఉన్నప్పుడు ముక్కు, నోరు, కళ్లను చేత్తో ముట్టుకోకపోవడమే మంచిది.
 
2. కోసిన పండ్లు, కూరగాయ ముక్కలు, ఫ్రిజ్‌లో పెట్టని పాలు, పాల ఉత్పత్తులు, పండ్లరసాలు, బంగాళాదుంపలు, అన్నం వంటివి తీసుకోకూడదు. ఇలాంటి వాటిల్లో క్రిములు ఎక్కువగా చేరుతాయి.
 
3. పిల్లలకు గాయాలైతే కట్టుకట్టడం మంచిది. లేదంటే వాటిల్లో క్రిములు చేరి సమస్య మరింత పెద్దదవుతుంది.
 
4. మధ్యాహ్నం రెండు గంటల లోపే గట్టి ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకునేవన్నీ తేలికగా జీర్ణమయ్యేవిగా ఉండాలి. రాత్రి భోజనం వీలైనంత తక్కువగా ఉండాలి.
 
5. పెరుగులోని మాంసకృత్తులు క్రమంగా శక్తినందిస్తూ ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడేట్టు చేస్తాయి. 
 
6. నీటిలో కొద్దిగా పంచదార లేదా ఉప్పు వేసుకుంటే శరీరం కోల్పోయిన లవణాలు తిరిగి పొందుతాయి. లేదా గ్లాసుడు పండ్లరసం... బత్తాయి, నారింజ వంటి రసాలు తాగితే మరీ మంచిది.