ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2019 (21:21 IST)

ఈ సీతాఫలం పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

వర్షాకాలం ప్రారంభమవగానే సీతాఫలాలు మార్కెట్లో కనబడతాయి. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇతర పండ్లతో పోల్చుకుంటే వాటి ధర కూడా తక్కువే. ఇలాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

సీతాఫలాల్లో సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. రోజూ ఒక సీతాఫలం పండును తినడం వల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్ధాలు బయటకు పంపిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఎ విటమిన్‌ కంటిచూపు మెరుగుపడడానికి దోహదపడుతుందని వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, జుట్టు ఒత్తుగా పెరగాలని ఆశపడే మహిళలు చక్కగా సీతాఫలం పండ్లను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినడం వల్ల సమస్య అదుపులో ఉంటుందని చెపుతున్నారు.ఈ పండ్లలో ఉండే మెగ్నీషియం కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, దాని పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
ఈ పండ్లలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయివున్న కొవ్వును కరిగించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలని వైద్యులు చెపుతున్నారు. ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే డైటింగ్‌ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.