కాలీఫ్లవరేకదా అని తెలికగా తీసిపారేయకండి...

cauliflower
మనీల| Last Modified శుక్రవారం, 4 అక్టోబరు 2019 (10:20 IST)
సాధారణంగా ఆకుపచ్చగా, పసుపు, బంగారు వర్ణం, ఎరుపు వంటి రంగుల్లో కనిపించే అన్ని రకాల కూరగాయల్లో వివిధ రకాల పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి. అయితే, కాలీఫ్లవర్, ముల్లంగి వంటి తెలుపు రంగులో ఉండే కూరగాయల్లో ఏముంటుందిలే అని పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. ఉదాహరణకు కాలీఫ్లవర్‌నే తీసుకుందాం...

ఇందులో పీచూతో పాటు విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కువగానూ, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లూ కేన్సర్‌ నుంచి రక్షించే ఫైటో న్యూట్రియంట్లూ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇండోల్ 3 కార్బినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్త్రీ, పురుషలిద్దరిలోనూ రొమ్ము, ప్రత్యుత్పత్తి అవయవ కేన్సర్లు రాకుండా కాపాడుతుంది.

అలాగే, ఇందులో ఉండే పీచూ నీటిశాతాన్ని, శరీర బరువును తగ్గిస్తుంది. ఈ రెండూ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేయడంతోబాటు కోలన్ కేన్సర్ రాకుండానూ కాపాడతుంది. ఊబకాయం, మధుమేహం, హృద్రోగం బారిన పడకుండా రక్షిస్తుంది. ఇందులోని విటమిన్-కె ఎముకల దృఢత్వానికీ దోహదపడుతుంది.దీనిపై మరింత చదవండి :