1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : గురువారం, 10 మే 2018 (15:58 IST)

కిడ్నీలో రాళ్లు పడకుండా వుండాలంటే.. ఎండుద్రాక్షల్ని?

ఎండుద్రాక్షాల్లో ఐరన్, బీ-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల ప్రతిరోజూ వీటిని తీసుకోవడం ద్వారా రక్తహీనత దరి చేరకుండా జాగ్రత్తపడొచ్చు. ఇవి శరీరంలోని అనవసరపు కొవ్వుని కరిగించడానికి ఉపయో

ఎండుద్రాక్షాల్లో ఐరన్, బీ-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల ప్రతిరోజూ వీటిని తీసుకోవడం ద్వారా రక్తహీనత దరి చేరకుండా జాగ్రత్తపడొచ్చు. ఇవి శరీరంలోని అనవసరపు కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడతాయి. ఎండుద్రాక్షాల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే ఎముకలు బలంగా అవుతాయి.
 
ఆస్టియోపోరోసిస్ వంటి వాటి నుంచి బయటపడొచ్చు. ఎసిడిటీతో బాధపడేవారికి కిస్‌మిస్‌లు మంచి మందులా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు ఎసిడిటీతోపాటు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉపయోగపడుతాయి. అంతేకాంకుడా ఇవి ఆరోగ్యకరమైన కంటి చూపుకి కూడా సహాయపడతాయి. అలాగే ఎండుద్రాక్షాల్లో లభించే ఓలినోలిక్ యాసిడ్‌తో పళ్లు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.