బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (09:47 IST)

కరోనా వ్యాక్సినేషన్ తర్వాత కలిగే దుష్ప్రభావాలేంటి?

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పుడు రెండో దశ వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. మొదటి దశలో తీసుకున్నవారు రెండో దశలో వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. అయితే 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏమాత్రం వెనకాడకుండా వ్యాక్సీన్ వేయించుకుంటున్నారు. 
 
2021 జనవరి 16న దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో హెల్త్​ కేర్, ఫ్రంట్‌లైన్ వారియర్స్​కు వాక్సినేషన్​ అందించగా, 2021 మార్చి 1 నుంచి రెండో దశను ప్రారంభమైంది. అయితే ఈ రెండో దశ వ్యాక్సిన్​ ప్రక్రియలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు, 45 నుండి 59 ఏళ్ల మధ్య గల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కోవిడ్‌ టీకా ఇస్తున్నారు.
 
కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత్​ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, సీరం ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్​లను ఇస్తున్నారు. అన్ని భద్రత చర్యలు తీసుకున్న తర్వాతే ఈ రెండు వ్యాక్సిన్లను ప్రవేశపెట్టినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 
 
అయితే, కోట్ల మందికి వ్యాక్సిన్​ ఇస్తుండటంతో, అక్కడక్కడా కొద్ది మందికి స్వల్పంగా రియాక్షన్ ​కావడంతో కొంతమంది టీకా వేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్​ అత్యంత సురక్షితమని, వాక్సిన్​ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. 
 
కరోనా టీకాలు వేయించుకున్న కలిగే చిన్నపాటి దుష్ప్రభావాలను తెలుసుకుందాం. 
 
కరోనా టీకా వేయించుకున్న తర్వాత ఇంజెక్షన్‌ ఇచ్చిన భాగంలో స్వల్పంగా నొప్పి, వాపు, జ్వరం, చలి, అలసట, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి సయయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు. వ్యాక్సిన్‌ తీసుకునే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి. 
 
వ్యాక్సిన్‌ విషయంలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే డాక్టర్‌ను అడగొచ్చు. అయితే సాధారణంగా, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చే దుష్ప్రభావాలు- ఒకటి లేదా రెండు రోజుల కన్నా ఎక్కువగా ఉండవు. 
 
ఒకవేళ ఉంటే, వైద్యుడిని సంప్రదించాల్సివుంటుంది. ఆందోళన చెందనక్కర్లేదు. మీ వైద్యుడు చెప్పిన జాగ్రత్తలను పాటించండి. వ్యాక్సిన్‌ తీసుకునే ముందు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వైద్యులు సలహా ఇస్తున్నారు.