శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 19 జులై 2019 (15:27 IST)

'వ్యాయామం' తర్వాత ఎలాంటి ఆహారం తినాలి?

చాలామంది వ్యాయామం చేసిన తర్వాత పాలు, గుడ్లు, ఉడకబెట్టిన లేదా పచ్చి కాయకూరలు ఆరగిస్తుంటారు. కానీ న్యూట్రిషన్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఎవరైనా అర్థగంటపాటు వ్యాయామం చేస్తే తిరిగి శక్తిని పుంజుకోవాలంటే ఖచ్చితంగా మంచి పోషకాహారం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, వ్యాయామం ద్వారా కోల్పోయిన శక్తి తిరిగి పొందేందుకు పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాలు అందేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
 
అయితే, వ్యాయామం తర్వాత అరటి పండు తినడం కంటే.. వ్యాయామానికి ముందే అరటిపండును తినడం ఏమాత్రం మంచిదికాంటున్నారు. అలాగే, పాలు, పెరుగు, గుడ్లు తీసుకోవచ్చు. వీలుంటే పన్నీరు, రెండు పండ్లు ఆరగించవచ్చని సలహా ఇస్తున్నారు.
 
పండ్ల ముక్కలను పెరుగుతో కలిపి తీసుకున్నా మంచిదేనంటున్నారు. ఈ తరహా ఆహారం తీసుకున్నట్టయితే తక్షణ శక్తి శరీరానికి అందుతుందని అంటున్నారు. అన్నిటికంటే ముందు వ్యాయామం తర్వాత, వ్యాయామానికి ముందు, వ్యాయామం మధ్యలో తరచుగా నీరు తీసుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండొచ్చని వైద్యులతో పాటు న్యూట్రిషన్లు సలహా ఇస్తున్నారు.