మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (16:40 IST)

విమాన ప్రయాణం... ఇంటువంటి ఆహారాలను తీసుకుంటే?

కొంతమంది ప్రయాణాలలో ఉన్నప్పుడు ఆహారాన్ని అస్సలు తీసుకోరు. ఇక కొందరు కొద్దిగా తింటారు. మరికొందరయితే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరు. అదేపనిగా ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అయితే ఎవరైనా తమ సౌకర్యానికి అనుగుణంగానే ప్రయాణాల్లో ఆహారం తీసుకుంటారు. కానీ విమానా

కొంతమంది ప్రయాణాలలో ఉన్నప్పుడు ఆహారాన్ని అస్సలు తీసుకోరు. ఇక కొందరు కొద్దిగా తింటారు. మరికొందరయితే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరు. అదేపనిగా ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అయితే ఎవరైనా తమ సౌకర్యానికి అనుగుణంగానే ప్రయాణాల్లో ఆహారం తీసుకుంటారు. కానీ విమానాల్లో ప్రయాణం చేసే వారైతే ప్రయాణానికి ముందు ఈ ఆహారాలను మాత్రమే తీసుకుంటారు. మరి అవేంటో తెలుసుకుందాం.
 
విమానంలో ప్రయాణానికి ముందుగా వేపుడు చేసిన ఆహారపదార్థాలను తీసుకోకూడదు. ఇవి ఎక్కువ నూనెను కలిగి ఉండడం వలన అసిడిటీని వంటి సమస్యలు ఏర్పడుతాయి. బ్రొకోలీ ఆరోగ్యానికి మంచిదే. కానీ విమాన ప్రయాణానికి ముందు దీనిని తినరాదు. తింటే గ్యాస్ సమస్య బాధిస్తుంది. కూల్ డ్రింక్స్, సోడా, వంటి కార్బొనేటెడ్ శీతల పానీయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
 
ఆల్కహాల్ తీసుకోవడం వల డీహైడ్రేషన్ బారిన పడుతారు. హ్యాంగోవర్ వంటి సమస్యలు వస్తాయి. దీనికి జెట్‌లాగ్ తోడైతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడేందుకు అవకాశాలున్నాయి. కాబట్టి ప్రయాణాంలో దీనిని తీసుకోకూడదు. ముఖ్యంగా మాంసాన్ని మాత్రం తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీనిద్వారా ప్రయాణంలో అసౌకర్యంగా ఉంటుంది.