శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 నవంబరు 2024 (18:22 IST)

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Dr Sai Snehit
అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ), కానూరు, తీవ్ర స్థాయి గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌తో బాధపడుతున్న 83 ఏళ్ల అల్లాడి రత్తమ్మ అనే రోగికి విజయవంతమైన చికిత్సతో అధునాతన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో మరో మైలురాయిని సాధించింది. శ్రీమతి రత్తమ్మ ఆరు నెలలుగా వైట్ డిశ్చార్జ్ , నాలుగు నెలలుగా రక్తస్రావం, రెండు నెలలుగా కడుపు నొప్పితో సహా తీవ్రస్థాయి లక్షణాలతో హాస్పిటల్‌కు వచ్చారు. చికిత్సలో రాడికల్ రేడియోథెరపీ, కంకరెంట్ కీమోథెరపి, బ్రేకిథెరపీతో కూడిన మల్టీడిసిప్లినరీ విధానం అనుసరించారు, ఇది రోగికి సరైన ఫలితాలను అందిస్తుంది.
 
సిటిఎస్ఐ-దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది, ఏఓఐ బృంద అంకితభావాన్ని ప్రశంసిస్తూ, "అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద, రోగి-కేంద్రీకృత చికిత్స ప్రణాళికలపై దృష్టి సారించి క్యాన్సర్ సంరక్షణ పరంగా అత్యున్నత ప్రమాణాలతో చికిత్స అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. సంక్లిష్ట పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న వృద్దులకు సైతం అధునాతన సాంకేతికత, వ్యక్తిగతీకరించిన సంరక్షణ విజయవంతమైన ఫలితాలకు ఎలా దారితీస్తుందో చూపటానికి ఈ కేసు ఉదాహరణగా నిలుస్తుంది "అని అన్నారు. 
 
ఏఓఐ కానూరు వద్ద రేడియేషన్ ఆంకాలజిస్ట్, డాక్టర్ సి. సాయి స్నేహిత్ మాట్లాడుతూ సకాలంలో జోక్యం, సమగ్ర సంరక్షణ ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఆయన మాట్లాడుతూ, "శ్రీమతి రత్తమ్మ కేసు గర్భాశయ క్యాన్సర్‌లకు ముందస్తు రోగనిర్ధారణ, అధునాతన మల్టీడిసిప్లినరీ చికిత్స యొక్క క్లిష్టమైన అవసరాన్ని వెల్లడిస్తుంది. మా విధానం ద్వారా ఆమెకు చికిత్స ప్రభావవంతంగా ఉంటుంది. దుష్ప్రభావాలను తగ్గించడం ద్వారా ఆమె తన జీవన నాణ్యతను తిరిగి పొందేందుకు వీలు కల్పించిందని నిర్ధారిస్తుంది.." అని అన్నారు. 
 
ఈ విజయగాథకు, ఏఓఐ ఆంధ్రప్రదేశ్, ఆర్సిఓఓ, మహేందర్ రెడ్డి జోడిస్తూ, "ఈ విజయం ప్రపంచ స్థాయి క్యాన్సర్ కేర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతను బలపరుస్తుంది. మా బృందం యొక్క నైపుణ్యం, ఏఓఐ కానూరులోని అత్యాధునిక సౌకర్యాలు ఇలాంటి క్లిష్టమైన కేసులను ఖచ్చితత్వంతో, కరుణతో పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయి " అని అన్నారు. 
 
ఈ కేసు విజయం, రోగి-కేంద్రీకృత విధానంతో అధునాతన చికిత్సా విధానాలను కలపడం వల్ల కలిగే ప్రయోజనాలను నొక్కి చెబుతుంది. రాడికల్ రేడియోథెరపీ, బ్రేకిథెరపీ అనేవి అత్యంత ఖచ్చితమైన పద్ధతులు, ఇవి క్యాన్సర్ కణాలను ప్రభావవంతంగా లక్ష్యంగా చేసుకుంటాయి, అయితే ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం చేయవు, దుష్ప్రభావాలను తగ్గించడం, రికవరీని వేగవంతం చేయడం సాధ్యమవుతుంది. కంకరెంట్ కీమోథెరపి రేడియోథెరపీ ప్రభావాన్ని పెంచుతుంది, చికిత్స సామర్థ్యాన్ని, రోగి ఫలితాలను మెరుగుపరుస్తుంది. ఏఓఐ యొక్క సమగ్ర మల్టీడిసిప్లినరీ కేర్ ప్రతి రోగి యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళికను పొందేలా నిర్ధారిస్తుంది. అదనంగా, సపోర్టివ్ కేర్‌పై దృష్టి కేంద్రీకరించడం శ్రీమతి రత్తమ్మ వంటి వృద్ధ రోగులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది, వారి జీవన నాణ్యతను కాపాడుకుంటూ సంక్లిష్ట చికిత్సలను అధిగమించటంలో వారికి సహాయపడుతుంది.
 
భారతదేశంలోని మహిళల్లో సర్వసాధారణమైన క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. అయినప్పటికీ, ఏఓఐ కానూరులో అందించబడిన ముందస్తు రోగ నిర్ధారణ, అధునాతన చికిత్సలు ప్రాణాలను కాపాడటంతో పాటుగా రోగి ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తాయి. ఏఓఐ వద్ద ఉన్న బృందం, క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు, సకాలంలో వైద్య జోక్యం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి కట్టుబడి ఉంది, ప్రతి రోగికి సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ అందుబాటులో ఉండేలా చూస్తుంది.