భాగస్వామిని సుఖపెడుతుంటే నిలువునా చీలిన పురుషాంగం...
తన భాగస్వామిని బాగా సుఖపెట్టాలని ఓ వ్యక్తి భావించాడు. దీంతో భాగస్వామితో ఏకాంతంగా శృంగారాన్ని మొదలుపెట్టాడు. ఈ శృంగారం పీక్ స్టేజ్‌లో ఉన్నసమయంలో పురుషాంగం నిలువునా చీలిపోయింది. ఈ విషయాన్ని బ్రిటీష్ మెడికల్ జర్నల్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇలాంటి కేసు ప్రపంచంలోనే తొలిసారి అని ఈ జర్నల్ వ్యాఖ్యానించింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బ్రిటన్‌కు చెందిన 40 యేళ్ల వయసున్న ఓ వ్యక్తి తన భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నాడు. శృంగారం చేస్తున్న సమయంలో ఆమె పెరెనియం భాగంలో పురుషాంగం తీవ్ర రాపిడికి గురైంది. ఆ తర్వాత అంగస్తంభన జరిగినప్పటికీ, పురుషాంగంలో వాపు కనిపించింది. క్రమంగా పురుషాంగం మెత్తబడటంతో.. బాధిత వ్యక్తి వైద్యులను సంప్రదించాడు.
వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించగా.. పురుషాంగం లోపల 3 సెంటిమీటర్ల దూరం నిలువునా చీలిపోయిందని తేలింది. ట్యునికా అల్బుజినియా (tunica albuginea) రెండుగా చీలింది. దీంతో అతని పురుషాంగానికి వైద్యులు సర్జరీ చేశారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. శృంగారం మాత్రం ఆరు నెలల తర్వాత చేయొచ్చు అని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఎప్పటి లాగే అంగస్తంభన ఉంటుందని, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు అని స్పష్టం చేశారు.