శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 10 మే 2018 (09:59 IST)

చికెన్‌కు పెరుగుతున్న డిమాండ్.. స్కిన్‌లెస్ కోడిమాంసం ధర రూ.220 నుంచి?

చాలామంది చికెన్ అంటే లొట్టలేసుకుని తినేస్తుంటారు. అదీ వేసవి సెలవుల్లో ఇంట్లో వున్న పిల్లలకు చికెన్ వంటకాలను తయారుచేసి వడ్డించేందుకు పెద్దలు ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు అమాంతం పెరిగిపో

చాలామంది చికెన్ అంటే లొట్టలేసుకుని తినేస్తుంటారు. అదీ వేసవి సెలవుల్లో ఇంట్లో వున్న పిల్లలకు చికెన్ వంటకాలను తయారుచేసి వడ్డించేందుకు  పెద్దలు ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వారు మరీ ఇష్టంగా లాగించే చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. అదీ ఆదివారం డిమాండ్ పెరిగిపోతుంది. 
 
కొన్ని రోజుల నుంచి వడగాడ్పుల తీవ్రత, అకాల వర్షాలతో కోళ్లు మృత్యువాత పడటంతో కోడి మాంసం ధర పెరిగిపోతుంది. ప్రస్తుతం స్కిన్‌లెస్‌ కోడి మాంసం ధర రూ.220 నుంచి రూ.240 మధ్యలో ఉండగా, 15 రోజుల క్రితం ఈ ధర రూ.180గా ఉండేది. 
 
ఓ వైపు ప్రతికూల వాతావరణంతో, మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కోడి మాంసానికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో కోడి మాంసం ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఈ నెల 17 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కావడంతో డిమాండ్ మరింత పెరిగే ఆస్కారం వుంది.