బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 9 మే 2018 (09:35 IST)

వేసవిలో వర్షాలు కుమ్మేయనున్నాయి.. ఈ నెల 11 నుంచి తెలుగు రాష్ట్రాల్లో?

వేసవిలో వర్షాలు కుమ్మేయనున్నాయి. అవును భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ప్రజలకు వాతావరణ శాఖాధికారులు చల్లని కబురు చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వ

వేసవిలో వర్షాలు కుమ్మేయనున్నాయి. అవును భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ప్రజలకు వాతావరణ శాఖాధికారులు చల్లని కబురు చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు వుంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
 
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 11, 12 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బస్సు షెల్టర్లు, ఇనుముతో తయారు చేసిన నిర్మాణ ప్రాంతాల్లో వుండవద్దని హెచ్చరించారు. 
 
ఇప్పటికే ఉత్తర భారతదేశంలోని ఢిల్లీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. సోమ, మంగళ వారాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 11 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండీ వెల్లడించింది.