సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (10:40 IST)

చైనా మెహందీలతో శరీరానికి ముప్పు.. డెర్మటాలజిస్టుల వార్నింగ్

గోరింటాకును ఇష్టపడని మహిళలంటూ ఉండరు. పండుగైనా, ఫంక్షనైనా గోరింటాకు పెట్టాల్సిందే. పూర్వం నుంచి ఇప్పటివరకు మహిళలకు ఇష్టమైనది గోరింటాకు. భారతీయ మహిళలకు గోరింటాకు అంటే చెప్ప‌లేని మ‌క్కువ‌. పూర్వం నుంచి వ

గోరింటాకును ఇష్టపడని మహిళలంటూ ఉండరు. పండుగైనా, ఫంక్షనైనా గోరింటాకు పెట్టాల్సిందే. పూర్వం నుంచి ఇప్పటివరకు మహిళలకు ఇష్టమైనది గోరింటాకు. భారతీయ మహిళలకు గోరింటాకు అంటే చెప్ప‌లేని మ‌క్కువ‌. పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికి మన వాళ్ళు గౌరవిస్తున్నారు. అయితే గోరింటాకు సేకరించడం, నూరుకోవడం శ్రమతో కూడినది కావడంతో చాలా మంది రెడీమేడ్ గోరింటాకును ఎంచుకుంటున్నారు. 
 
చైనా మెహందీతో జాగ్రత్త అంటూ ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చైనావే కాదు స్థానికంగా తయారయ్యే మెహందీలతోనూ ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిల్లో వాడే రసాయనాలు శరీరానికి హాని చేస్తాయని అంటున్నారు. 
 
చేతులు ఎర్రగా ఎక్కువ రోజులు ఉండేందుకు, మెహెందీ, హెన్నా, హెయిర్ డైలో పలు రసాయనాలు కలుపుతారని చెబుతున్నారు. కొందరికి ఈ కెమికల్స్ అలర్జీ కలిగిస్తాయని, ఫలితంగా శరీరంపై దద్దర్లు వంటివి వస్తుంటాయని డెర్మటాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.