తేలు విషం.. లీటరు ధర ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.36 కోట్లు!
ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవ పదార్థం ఏదైనా ఉందంటే అది తేలు విషం. సాధారణంగా తేలును చూస్తే చాలా మంది భయపడతారు. అది కుట్టిందంటే మరణించే అవకాశాలు కూడా లేకపోలేదు. అసలు విషయానికి వెళ్తే తేలు తన ఆహారం కోసం ఇతర కీటకాలను చంపి, తనను తాను శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి తన కొండిలోని విషాన్ని ఉపయోగిస్తుంది. ఆ విషం అత్యంత ప్రమాదకరం.
కానీ అదే విషం కొన్ని సార్లు విరుగుడుగా పని చేస్తుందంటే నమ్ముతారా...? అవును నిజమే ఇప్పుడు తేలు విషం మనుషుల్లో ఎన్నో రోగాలకు, ఎన్నో రుగత్ములకు మందుగా పని చేస్తుందట. తేళ్ళలో వేల రకాల జాతులన్నా కానీ కేవలం 25 రకాల జాతుల్లో మాత్రమే జీవులని చంపేటంత విషాన్ని కలిగి ఉంటాయట. తేలు విషంలోని ప్రోటీన్ కీళ్ల వాపులకు, పేగు వ్యాధికి, కొన్ని రకాల కేన్సర్ వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇంతకీ లీటర్ తేలు విషం ఖరీదు ఎంతో తెలిస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. అక్షరాలా రూ.36 కోట్లు. ఆశ్చర్యంగా ఉంది కదూ.