శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 29 అక్టోబరు 2018 (21:47 IST)

గుండె జబ్బు రోగులు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే..?

గుండె జబ్బుల రోగులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం ఒక్కటే గుండె జబ్బు సమస్య కాదని, వీధుల్లోని రణగొణ ధ్వనులు కూడా గుండెపోటుకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్విట్జర్లాండుకు చెందిన ట్రాపికల్ అండ్ పబ్లిక్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తల పరిశోధనలో ఇది వెల్లడైందట.
 
ఉపగ్రహ చిత్రాల సాయంతో గాల్లోని కాలుష్య కారక కణాల మోతాదులు స్విట్జర్లాండులోని మొత్తం 1834 కేంద్రాల నుంచి సేకరించిన నెట్రోజన్ డయాక్సైడ్ వివరాలను ఎనిమిదేళ్ళ మధ్యకాలంలో గుండె పోటుతో మరణించిన 19,261 మంది వివరాలతో జోడించి చూసినప్పుడు ఈ ఫలితాలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలుష్య కారక కణాలు పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఎక్కువైన కొద్దీ మరణాల రేటు కూడా ఎక్కువవుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలిందట. అలాగే ప్రతి ట్రాఫిక్ రణగొణ ధ్వనుల మోతాదు పెరిగితే కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందట.