Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బెల్లాన్ని నువ్వులతో కలిపి తింటే ఏమవుతుంది?

Written By సిహెచ్
Updated: బుధవారం, 19 జూన్ 2019 (13:44 IST)
బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రాలలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు. సాధారణంగా చెరుకు రసం నుండి బెల్లాన్ని తయారుచేస్తారు. బెల్లంలో అనేక రకములైన ఔషద గుణాలున్నాయి. 
 
ప్రతిరోజు కాస్త బెల్లం ముక్క తినడం వల్ల రక్త శుద్ది జరిగి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా లివర్ పని తీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఫ్రీరాడికల్స్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. మరి ఇన్ని పోషకాలు ఉన్న బెల్లం మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు 100 గ్రాముల బెల్లం తినడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు.
 
2. వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ, నీరసం వంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు బెల్లాన్ని తినడం వల్ల ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
 
3. బెల్లం మంచి ఔషధం. శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. బెల్లం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
 
4. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కాస్త బెల్లం కలుపుకుని తాగడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.
 
5. బెల్లాన్ని నువ్వులతో కలిపి తినడం వల్ల ఆస్తమా, బ్రాంకైటీస్ లాంటి సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజు మద్యాహ్నం, రాత్రి భోజనం అయ్యాక కాస్త బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. 
 
6. కీళ్ల నొప్పుల భాదితులు రోజూ 50 గ్రాముల బెల్లం చిన్న అల్లం ముక్కని కలిపి తినడం వల్ల ఆ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ప్రతిరోజు తాగే పాలల్లో పంచదార బదులు బెల్లం కలుపుకుని తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments