సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (09:37 IST)

నానబెట్టిన పెసరపప్పులో బెల్లం కలిపి తింటే..?

బెల్లం ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. తరచు బెల్లం తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. బెల్లంలోని పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. బెల్లంలోని న్యూట్రియన్స్ డయాబెటిస్ వ్యాధికి అదుపులో ఉంచుతాయి. అలానే ముదురు రంగు బెల్లంలో కల్తీ ఉండదు. బెల్లంలో చక్కెర శాతం చాలా తక్కువగా మోతాదులో ఉంటుంది. 
 
బెల్లంలోని ఐరన్, ఫోలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గిపోకుండా చూస్తాయి. దాంతో రక్తహీనత సమస్య వచ్చే ముప్పును నివారిస్తుంది. రోజూ కొద్దిగా బెల్లం తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. ప్రతిరోజూ వేడినీళ్ళల్లో కొద్దిగా బెల్లం కలిపి తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే టీ తాగేవారు అందులో చక్కెరకు బదులు బెల్లం వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. 
 
అసిడిటీని తగ్గించి, జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేసేలా చూస్తుంది. భోజనం చేసిన తరువాత కొద్దిగా బెల్లం తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీనిలోని పీచుపదార్థం కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల్ని పోగొడుతుంది. అంతేకాదు శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. అల్లం లేదా పాలతో బెల్లం కలిపి తింటుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు గట్టిపడుతాయి. 
 
బెల్లంలో పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ వంటివి అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి పెద్దప్రేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 5 గ్రాముల బెల్లంలో 5 మిల్లీగ్రాముల మెగ్నిషియం లభిస్తుంది. కప్పు పెసరపప్పును నీటిలో కాసేపు నానబెట్టుకుని.. ఆపై బాగా శుభ్రం చేసుకుని అందులో కొద్దిగా బెల్లం, కొబ్బరి తురుము వేసుకుంటే తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తయారుచేసిన పదార్థాలు తరచు తింటుంటే శ్వాససంబంధిత వ్యాధులు దరిచేరవు.