మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (22:10 IST)

వేసవిలో కోమలమైన, కాంతివంతమైన మేని ఛాయ కోసం...

వేసవిలో ఎండల్లో తిరగడం వలన ముఖంతో పాటు చేతులు, పాదాలు నల్లబడతాయి. వీటిని తగ్గించుకోవడానికి తేలికపాటి ఇంటి చిట్కాలు సమర్దవంతంగా పని చేస్తాయి. ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరుస్తూ చేతులు, పాదాలు నల్లగా ఉంటే చూడడానికి అసహ్యంగా ఉంటుంది. కొన్ని రకాల గృహ చిట్కాలతో ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
 
1. శనగపిండి ప్యాక్ చర్మంపై టాన్‌ను తొలగించడంలో చాలా అద్బుతంగా పని చేస్తుంది. రెండు చెంచాల శనగపిండి, ఒక చెంచా పసుపు, రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి చక్కని ప్యాక్ తయారుచేసుకుని చేతులు, పాదాలకు రాసుకుని పూర్తిగా ఆరాక చల్లని నాటితో కడిగివేయాలి. 
 
2. విటమిన్ సి ఎక్కువగా ఉండే, మంచి బ్లీచింగ్ ఏజెంట్‌లా పని చేసే నిమ్మకాయలు చర్మాన్ని శుభ్రపరుచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అరచెక్క నిమ్మకాయను తీసుకుని దానిపై కొంచెం పంచదారను వేసి చేతులు, పాదాలపై రుద్దాలి. పది నిముషములు అలా వదిలేసి తరువాత కడిగివేయాలి.
 
3. టమోటాలు సహజమైన బ్లీచింగ్ పదార్థం మాత్రమే కాదు, యువి కిరణాల నుండి మీ చర్మం యొక్క సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. టమోటా రసం లేదా అరచెక్క టమోటాను సమస్య ఉన్నచోట రుద్ది అయిదు నిమిషాల తరువాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.