శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2019 (20:36 IST)

నవధాన్యాలలో ఒకటైన అలసంద... పవర్ ఏమిటో తెలుసా?

నవధాన్యాలలో ఒకటైన అలసందలలో పోషక విలువలు అమోఘంగా ఉంటాయి. దీనిలోని పీచుపదార్దం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. బొబ్బర్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికరమైన టాక్సిన్స్‌ను కూడా నియంత్రిస్తాయి. బొబ్బర్లలో ఉన్న ఆరోగ్యప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. అలసందల్లో అధిక ఫైబర్ కలిగి ఉండడం వలన కడుపులో అనుకూల ప్రభావంను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
 
2. వీటిల్లో పుష్కలంగా లభించే మిటమిన్ కె మెదడు చురుకుగా పని చేయడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా నరాలకు బలాన్ని ఇస్తుంది. బొబ్బర్లలో ఉండే ఐరన్, మెగ్నీషియం మన ఎనర్జీ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి.
 
3. అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నార్మల్‌గా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని తినటం వల్ల కడుపు బరువుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.     
 
4. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినరల్స్ పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఒంట్లో కొవ్వు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజుకో కప్పు నానబెట్టి ఉడికించిన అలసందలు తింటే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.