Dharma Sangrah
✕

వాము రసంలో కొంచెం పసుపు, తేనె కలిపి తీసుకుంటే..?

వాము మంచి ఔషధపు మెుక్క. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన బరువును, కొవ్వును తొలగించడంలో ఇది సహాయపడుతంది.

Written By chj
Updated: మంగళవారం, 3 జులై 2018 (22:40 IST)
వాము మంచి ఔషధపు మెుక్క. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన బరువును, కొవ్వును తొలగించడంలో ఇది సహాయపడుతంది. దీని ప్రయోజనాలు ఏమిటంటే......
 
1. ఒక టేబుల్ స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయానే మరిగించి చల్లార్చి పరగడుపున ప్రతి రోజు తాగటం వలన శరీర బరువు తగ్గుతుంది.
 
2. ప్రతి రోజు ఒక స్పూన్ వామును తినడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, రకరకాల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.
 
3. వాములో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కవుగా ఉంటాయి. వాములో ఉండే తైమల్ అనే రసాయనం బ్యాక్టీరియాను, ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్, అలసటకి వాము ఔషధంగా పనిచేస్తుంది.
 
4. వాము ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించటం వలన అజీర్తి సమస్యలు, మలబద్దకం తగ్గుతాయి. వాము నుంచి తీసిన నూనెను కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు రాసుకోవటం వలన తక్షణ ఉపశమనం కలుగుతుంది.
 
5. వాము రసంలో కొంచెం పసుపు, తేనె కలిపి తీసుకోవడం వలన జలుబు, కఫం నుంచి  ఉపశమనం పొందవచ్చు.

అన్నీ చూడండి

స్వదేశీ పరిజ్ఞానంతో తొలి బుల్లెట్ రైలు - గంటకు 280 కిమీ వేగం - 557 మంది ప్రయాణం

Call Recording: పెళ్లికి నిరాకరించిన వ్యక్తి.. నీటి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన యువతి

Jogini Sudhakar: బంగారం కోసం జోగిని సుధాకర్ హత్య.. నలుగురు అరెస్ట్

తీవ్ర తుఫానుగా మురుసు - కోస్తాంధ్రకు రెడ్ అలెర్ట్ - నెల్లూరు - నర్సాపురం మధ్య తీరందాటే ఛాన్స్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

అన్నీ చూడండి

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్‌సీ-17

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ రాబోతోంది

నువ్వు విలన్ వి ? చనిపోతావా? ఓడిపోతావా? అని నిలదీశిన యశ్ కుమారుడు

Rudravanam PS Series Review: రుద్రవనం పీఎస్ లో మర్డర్ల రహస్యం ఏమిటి? వెబ్ సిరీస్ రివ్యూ

Prakash Raj, ఇచ్చిన సినీ అడ్వాన్సులు వెనక్కి తీస్కుంటున్నారు: ప్రకాష్ రాజ్ భార్య పోనీ

తర్వాతి కథనం
Show comments