మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది

మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆదారపడి ఉంటుంది. ప్రస్తుతకాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వలన, కాలుష్యం ప్రభావం వలన రకరకాల వ్యాధులు దరిచేరుతున్నాయి. మన రోజూవారి ఆహారంలో సరైన పోషకాలు, విటమిన్లు లేకపోవడమే ఇందుకు కారణం. ఆకాకరకాయలో మన శరీరానికి మేల

శనివారం, 22 సెప్టెంబరు 2018 (20:38 IST)
మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆదారపడి ఉంటుంది. ప్రస్తుతకాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వలన, కాలుష్యం ప్రభావం వలన రకరకాల వ్యాధులు దరిచేరుతున్నాయి. మన రోజూవారి ఆహారంలో సరైన పోషకాలు, విటమిన్లు లేకపోవడమే ఇందుకు కారణం. ఆకాకరకాయలో మన శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో పీచూ, విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి. ఆకాకరకాయల్లో ఉండే ఔషద గుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. మధుమేహంతో బాధపడేవారికి ఆకాకరకాయ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది. దీనిలో ఉండే పైటో న్యూట్రియంట్లు కాలేయం, కండర కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.
 
2. జీర్ణవ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి.
 
3. ఆకాకరకాయ గర్బిణులకు చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫొలెట్‌లు శరీరంలోని కొత్తకణాల వృద్ధికి, గర్బస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. గర్భిణులు రెండుపూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వలన దాదాపు వంద గ్రముల ఫొలెట్ అందుతుంది.
 
4. ఆకాకరకాయను తరచూ తీసుకోవడం వలన దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.
 
5. ఆకాకరకాయలోని విటమిన్ సి శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ప్లవనాయిడ్లు సమృద్దిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ కారకాలుగా పని చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 
6. దీనిలో లభించే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది.

అన్నీ చూడండి

ప్రజాస్వామ్యంలో ఎవరైనా.. ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు: చంద్రబాబు

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడి మృతి

పవన్‌కు అండగా నిలిచిన చంద్రబాబు: ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు..(video)

ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.. భర్త ముఖంపై యాసిడ్ పోసింది.. జీవితఖైదు

తెలంగాణ సచివాలయంలో పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం ఊరుకోం : కేటీఆర్

అన్నీ చూడండి

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

తర్వాతి కథనం
Show comments