శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (17:02 IST)

ఉడికించిన గుడ్డును ఎంత సమయంలోపు ఆరగించాలి?

సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మంచి పోషకాలు అందించేది గుడ్డు. పైగా, చికెన్, మటన్ కంటే అతి తక్కువ ధరకు మార్కెట్‌లో లభ్యమయ్యేది గుడ్డు. అందుకే ఈ గుడ్డును ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే, గుడ్డును ఉడకబెట

సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మంచి పోషకాలు అందించేది గుడ్డు. పైగా, చికెన్, మటన్ కంటే అతి తక్కువ ధరకు మార్కెట్‌లో లభ్యమయ్యేది గుడ్డు. అందుకే ఈ గుడ్డును ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే, గుడ్డును ఉడకబెట్టిన తర్వాత చాలా ఆలస్యంగా ఆరగిస్తుంటారు.
 
నిజానికి ఉడకబెట్టిన గుడ్డును ఎంతసమయంలోపు తినాలన్నదానిపై చాల మందిలో స్పష్టతలేదు. దీంతో ఉదయం ఉడకబెట్టిన గుడ్డును సాయంత్రం కూడా ఆరగిస్తుంటారు. అసలు గుడ్డును ఉడకబెట్టిన తర్వాత ఎంతసమయం లోపు ఆరిగించాలో ఇపుడు తెలుసుకుందాం. 
 
గుడ్డును నూనెలో ఫ్రై చేసుకుని తినడం కంటే.. ఉడకబెట్టి ఆరగిస్తేనే పోషకాలు అందుతాయి. అయితే గుడ్లను ఉడకబెట్టి చాలామంది ఆలస్యంగా ఆరగిస్తుంటారు. వాస్తవానికి ఆలా చేయరాదు. అలాచేస్తే గుడ్డుపై వైరస్, బ్యాక్టీరియాలు చేరి అవి త్వరగా కలుషితమయ్యే (చెడిపోయే) అవకాశం ఉంది. 
 
గుడ్డును ఉడికించిన తర్వాత ఒకపూట వరకు బయట ఉంచవచ్చు. కానీ పూటగడవక ముందే పొట్టు తీసి తినటం మంచిది. ఒకేవేళ ఇంట్లో ఫ్రిజ్ ఉన్నట్లయితే.. అందులో గుడ్లు పెట్టాలనుకుంటే పొట్టు తీయకుండా వారంరోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అంతకుమించి నిల్వ చేయడం ఏమాత్రం మంచిది కాదు. 
 
ఒకవేళ ఫ్రిజ్‌లో పొట్టు తీసి గుడ్లు పెట్టినట్లయితే... 3-4 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఉడికించిన గుడ్లను గాలి దూరని ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే గుడ్లు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.