సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 19 సెప్టెంబరు 2018 (20:31 IST)

నా నిద్ర.. నా ఇష్టం... అంటే ఇప్పటి కాలంలో కుదర్దండీ... దానికీ ఓ లెక్కుంది...

మనకు రోజుకి ఎన్ని గంటలు నిద్ర సరిపోతుంది. ఆరా? ఏడా? లేక ఎనిమిదా? అసలు ఎన్నిగంటలు నిద్రపోవాలి? ఎక్కువ సమయం నిద్రపోతే ఏమి జరుగుతుంది? అలాగే తక్కువ సమయం నిద్రపోతే ఫలితం ఏమిటి? అసలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఈ ప్రశ్నలన్నింటి

మనకు రోజుకి ఎన్ని గంటలు నిద్ర సరిపోతుంది. ఆరా? ఏడా? లేక ఎనిమిదా? అసలు ఎన్నిగంటలు నిద్రపోవాలి? ఎక్కువ సమయం నిద్రపోతే ఏమి జరుగుతుంది? అలాగే తక్కువ సమయం నిద్రపోతే ఫలితం ఏమిటి? అసలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే ఇది చదవాల్సిందే.
 
ఒక రోజులో మనిషికి ఏడు గంటల ప్రశాంతమైన నిద్ర కావాలంటారు వైద్య నిపుణులు. నిద్ర అంతకన్నా ఎక్కువైనా.. తక్కవైనా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలో వెల్లడించారు. అంతేకాదు, నిద్ర హెచ్చుతగ్గుల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అమెరాకాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీకి చెందిన భారతీయ శాస్త్రవేత్త అనూప్ శంకర్ బృందం నిద్రపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
 
అమెరికాలోని 30,000 మంది పెద్దవారిపై వారు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో రోజుకి ఏడు గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే తొమ్మిది గంటలకుపైగా నిద్రపోయే వారికి గుండె సంబంధింత సమస్యలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఎవరైతే ఐదు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రించే 60ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఈ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.
 
ఈ పరిశోధన ప్రకారం, తక్కువ సమయం నిద్రించేవారు యాంగినా (శ్వాస ఆడకపోవటం) వంటి సమస్యతో, అలాగే ఎక్కువ లేదా తక్కువ సమయం నిద్రించేవారు గుండెపోటు, పక్షవాతం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అయితే.. వయస్సు, స్త్రీ, పురుషులు, పొగ తాగేవారు, మద్యపాన ప్రియులు, బక్కపలచనివారు, ఊబకాయులు ఇలా అందరి విషయాల్లోనూ ఈ ఫలితాల ఒకే రకంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
 
ఇదిలా ఉంచితే.....! నిద్ర వల్ల మరో పెద్ద సమస్య ఏంటంటే "నిద్రలేమి" దీనిని వైద్య పరిభాషలో "ఇస్నోమనియా" అంటారు. ఈ నిద్రలేమి కారణంగా అలసట, కలవరపాటు, అవిశ్రాంతత వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ నిద్రలేమిని అధిగమించిటానికి కొన్ని చిట్కాలు మీకోసం... 
 
* నిద్ర విషయంలో ఒక నిర్ధిష్ట సమయాన్ని కేటాయించుకోండి. ప్రతి రోజు అదే సమయానికి నిద్రపోండి. అలాగే నిద్ర మెలకువకు కూడా సమయాన్ని పాటించండి. ఇలా చేయడం వల్ల మీ మనస్సు, శరీరం మీ నిద్ర విషయంలో క్రమబద్దీకరించబడతాయి.
 
* నిద్రకు ఉపక్రమించే ముందు కొద్దిగా స్నాక్ ఫుడ్ తీసుకోండి. అలాగని ఎక్కువ కారంగా ఉండే పదార్ధాలను కానీ, మిఠాయిలను కానీ తీసుకోకండి. సీరియల్స్ లేదా కొన్ని బ్రెడ్ ముక్కలు తీసుకున్నట్లయితే, ఇవి జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గించి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మామూలుగా కొంత మంది తిన్న ఆహారం జీర్ణంకాక పోయినా నిద్ర సమస్య తలెత్తుతుంది. అలాంటి వారు ఇలా స్నాక్‌ ఫుడ్ తీసుకోడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమయ్యి ప్రశాంతమైన నిద్రను పొందుతారు.
 
* నికోటిన్‌కు దూరంగా ఉండండి.... లేదా నిద్రకు ఉపక్రమించే 5-6 గంటలకు ముందు వరకూ ఎటువంటి నికోటిన్ పదార్ధాలను సేవించకండి.
 
* చాలా మంది నిద్రకు ముందు ఆల్కహాల్ (మద్యం) సేవిస్తారు, పైగా ఇలా సేవంచండం వల్ల సుఖమైన నిద్రను పొందవచ్చనేది వారి అభిప్రాయం కూడా... నిజానికి ఇది పెద్ద అవాస్తం. అంతే కాకుండా దీని వల్ల వేరే సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. సాధారణంగా నిద్రకు ముందు మద్యం సేవిస్తే నిద్ర మధ్యలో చికాకులు కలుగుతాయి. కావున నిద్రకు ఉపక్రమించే 5-6 గంటలకు ముందు వరకూ మద్యాన్ని సేవించకండి.
 
* నిద్ర పోవటాని ముందు పాలు తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి నిద్రను పొందుతారు. కానీ ఆకలితో మాత్రం ఎప్పుడూ పడుకోకండి.
 
* పడక గదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి. పడక గదిలో మంచి గాలి వచ్చేలా వెంటిలేటర్లను ఏర్పాటు చేసుకోండి. ఎటువంటి శబ్దాలు రాకుండా ఉండేలా జాగ్రత్త పడండి. అవసరమైతే ఇయర్‌ప్లగ్‌లను కానీ, దూదిని కాని ఉపయోగించండి.
 
* చివరిగా... ఎలాంటి ఆలోచనలు పెట్టకోకుండా బాగా కాళ్లు చాచుకొని ప్రశాంతంగా నిద్రపోండి. సోఫాలు, కుర్చీలలో ఇబ్బందిగా పడుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు కాదని గమనించండి.