ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (09:57 IST)

ఆలివ్ నూనెను మరిగించి ఇలా చేస్తే..?

ఈ చలికాలంలో ఆలివ్ నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ నూనె శరీరానికి ఎన్నో పోషక విలువలను అందిస్తుంది. ఈ నూనె తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. దీనిని తరచు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
1. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే.. రోజువారి ఆహారంలో ఆలివ్ నూనె చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చును. చర్మరక్షణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. 
 
2. ఈ శీతాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అలాంటప్పుడు.. స్నానం చేసే ముందుగా శరీరానికి ఆలివ్ నూనె రాసుకుని గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత స్నానం చేస్తే ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
3. జలుబు, దగ్గుతో బాధపడేవారు.. ఆలివ్ నూనెను వేడి చేసుకుని అందులో కొద్దిగా శొంఠి, పుదీనా ఆకులు చేసి మరికాసేపు మరిగించుకోవాలి. ఇలా తయారైన నూనెను గొంతులు రాసుకుంటే ఈ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. 
 
4. చాలామందికి చిన్న వయస్సులోనే చర్మం ముడతలుగా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే.. ఆలివ్ నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తే... చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
5. అధిక బరువు కారణంగా చాలామందికి శరీరంలో వ్యర్థాలు అధికంగా ఉంటాయి. వాటిని తొలగించాలంటే.. ఆలివ్ నూనెను వాడాలి. ఆలివ్ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ వ్యర్థాలు తొలగించుటకు మంచిగా దోహదపడుతాయి. కాబట్టి రోజూ ఆలివ్ నూనెను వాడడం మరచిపోకండి..