గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 17 జులై 2018 (20:38 IST)

నువ్వుల నూనెతో మర్దన చేస్తే అలాంటివారికి ఏం జరుగుతుందో తెలుసా?

నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బక్కపలచని వారు బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. సత్తు పిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. అలాగే సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు.

నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బక్కపలచని వారు బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. సత్తు పిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. అలాగే సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు. 
 
పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం. పుట్టగొడుగులు ఆయుర్వేదం ప్రకారం మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి. లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం. ముదురు వంకాయ రోగకారకం. 
 
అయితే ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. అయితే లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం. బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి.