శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2017 (22:25 IST)

వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే...

మన పెద్దవారు ఉదయాన్నే లేవగానే పరగడుపున వేడినీళ్లు తాగమని చెప్తుంటారు. ఇలా వేడినీరు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొందరిలో చెమటలు పడతాయి. ఆ చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి శరీరం శుద్ధి జరుగుతుంది. ఇంకా వేడినీరు

మన పెద్దవారు ఉదయాన్నే లేవగానే పరగడుపున వేడినీళ్లు తాగమని చెప్తుంటారు. ఇలా వేడినీరు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొందరిలో చెమటలు పడతాయి. ఆ చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి శరీరం శుద్ధి జరుగుతుంది. ఇంకా వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
* ఫిల్టర్ నుంచి పట్టిన నీళ్లను స్టౌ మీద తగినంతగా వేడిచేసుకొని వేడి నీళ్లు తాగితే వర్షా కాలంలో వచ్చే వ్యాధులను చాలామటుకు నిరోధించవచ్చు. గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా శ్వాస సక్రమంగా ఆడుతుంది. వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ఉపసమనం కలుగుతుంది.
 
* బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి. ఎంత ఉపసమనం కలిగిస్తుందో మీరే గమనించండి.
 
* నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేసేందుకు వేడినీళ్లు ఉపయోగపడతాయి. నరాలు చురుకుగా ఉండడం వల్ల మన ఆలోచనలు చురుకుగా ఉంటాయి. అంటే వేడినీళ్లు తాగడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతాయి.