శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (16:32 IST)

మెడ సౌందర్యాన్ని మెరుగు పెంచే ఎగ్ ప్యాక్..

ముఖాన్ని స్క్రబ్ చేసేటప్పుడు మెడపై కూడా స్క్రబ్ చేయాలి. మెడ భాగంలోనే చెమట పడుతుంది. అందుకే ముఖానికి స్క్రబ్ వేస్తే.. తప్పకుండా మెడకు కూడా స్క్రబ్ చేయాలంటున్నారు బ్యూటీషియన్లు. తద్వారా మృతకణాలు తొలగిపో

ముఖాన్ని స్క్రబ్ చేసేటప్పుడు మెడపై కూడా స్క్రబ్ చేయాలి. మెడ భాగంలోనే చెమట పడుతుంది. అందుకే ముఖానికి స్క్రబ్ వేస్తే.. తప్పకుండా మెడకు కూడా స్క్రబ్ చేయాలంటున్నారు బ్యూటీషియన్లు. తద్వారా మృతకణాలు తొలగిపోతాయి. ముడతలకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్డులోని తెల్లసొనలో ఒక స్పూన్ తేనె చేర్చి మెడకు పూతలా వేసుకోవాలి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. ముడతలను దూరం చేసుకోవచ్చు. నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. 
 
అలాగే ఓట్స్‌ను ఉడికించి.. ఆరబెట్టుకోవాలి. ఆ మిశ్రమంలో కోడిగుడ్డు తెల్లసొన, నిమ్మరసం ఒక స్పూన్ చేర్చి మెడకు ప్యాక్‌లా వేసుకుంటే ముడతలను దూరం చేసుకోవచ్చు. ఇలా 15 రోజులకు ఓ సారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
పీచ్ పండ్లు పెరుగు, తేనె కలిపి మెడకు రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. నల్లటి వలయాలు, ముడతలు దూరమవుతాయి. సౌందర్యం మెరుగవుతుంది. విటమిన్ క్యాప్సూల్స్ లేదా క్రీములను రాత్రి నిద్రించేందుకు ముందు మెడకు రాసి మసాజ్ చేస్తూ వస్తే.. నల్లటి వలయాలు తొలగిపోతాయి.