శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (15:11 IST)

కర్బూజ పండుతో చర్మ సౌందర్యం.. ఫేస్ డల్‌గా ఉంటే?

కర్బూజ పండులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో పాటు సౌందర్యాన్నిచ్చే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కర్బూజలో పీచు, కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉండటం ద్వారా ఇవి జుట్టుకు.. చర్మానికి నిగారింపును ఇస్తాయి. మ

కర్బూజ పండులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో పాటు సౌందర్యాన్నిచ్చే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కర్బూజలో పీచు, కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉండటం ద్వారా ఇవి జుట్టుకు.. చర్మానికి నిగారింపును ఇస్తాయి. ముఖం జిడ్డుగా మారితే కర్బూజ గుజ్జును ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే చర్మ సౌందర్యం పెంపొందుతుంది. చర్మం పొడిబారకుండా వుంటుంది. కర్బూజ, కీరదోస జ్యూస్‌ను సమపాళ్లలో తీసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
 
కర్బూజ గింజల పొడి వంద గ్రాములు తీసుకుని అందులో ఓట్స్ పౌడర్‌ను వందగ్రాములు కలిపి తగినంత కీరదోస జ్యూస్‌ చేర్చాలి. ఈ పేస్టును చర్మానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఓట్స్ ముఖంపై నల్లాటి మచ్చలను తొలగిస్తుంది. చర్మంలోని క్రిములను నశింపజేస్తుంది. కర్బూజ గింజలు చర్మానికి మేలు చేయడంతో పాటు కేశానికి మంచి కండిషనర్‌గా ఉపయోగపడతాయి. 
 
అలాగే ముఖం డల్‌గా ఉంటే.. అందవిహీనంగా మారిపోతే.. అలాంటి వారు కర్బూజ పండు గుజ్జును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. వందగ్రాముల కర్బూజ గింజల పొడితో పాటు, పెసళ్లు, కుంకుడు కాయ పావు కేజీని చేర్చి పౌడర్ చేసుకుని.. దాంతో హెయిర్ వాష్ చేస్తే జుట్టు రాలదు.