శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By మనీల
Last Modified: శనివారం, 12 అక్టోబరు 2019 (10:09 IST)

వేడిగా టీ త్రాగుతున్నారా అయితే క్యాన్సర్ తధ్యం...

మార్నింగ్ నిద్ర లేవ‌గానే వేడి వేడిగా ఓ క‌ప్పు టీ తాగ‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు. టీ తాగ‌డం వ‌ల్ల అలసట దూరమౌతుందన్న మాట వాస్తవమే. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఎక్కువ వేడిగా ఉన్న టీలు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు గోరువెచ్చ‌గా ఉంటే ఇష్ట‌ప‌డ‌తారు. కాని వేడి వేడి టీ తీసుకోవడం వలన గొంతు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలినట్లు వైద్య బృందం వెల్లడించింది. 
 
వేడివేడి కాఫీ, టీలు తాగడం వల్ల సున్నితంగా ఉండే ఆ ప్రభావం గొంతునాళంపై పడి మంట, పుండ్లు ఏర్ప‌డి ఈ క్యాన్స‌ర్ రావ‌డానికి కార‌ణం అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. మిమ్మల్ని టీ తాగకూడదు అని అనడం లేదు. కాని వేడి వేడిగా టీ లాంటివి త్రాగకూడదంటున్నారు వైద్యులు. దీనివలన గొంతుకు సంబంధించిన వ్యాధులు అధికమౌతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.