బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (21:06 IST)

వంకాయ, గుమ్మడి కాయలు తింటే మోకాళ్ల నొప్పులు వస్తాయా?

మోకాళ్ల నొప్పులు. ఈ సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య మరింత ఎక్కువ. కొందరు వంకాయ, గుమ్మడికాయ తింటే మోకాళ్ల నొప్పులు వస్తాయని భావిస్తుంటారు. కానీ ఇందులో నిజం లేదు. పిండి పదార్థాలు, అధికంగా కొవ్వు పదార్థాలు తినడం వల్ల ఊబకాయం వస్తే మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం వుంటుంది. 
 
మోకాళ్ల నొప్పులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
 
1. తొడ కండరాలను బలోపేతం చేసే దిశగా వ్యాయామం చేయాలి. నడక, ఈత మంచిది. నడిస్తే మోకాళ్లు అరుగుతాయనేది అపోహ.
 
2. కింద కూర్చోవడం మానేయాలి.
 
3. సంప్రదాయ టాయిలెట్లు వాడకపోవడం మంచిది.
 
4. యోగా చేసేవారు వజ్రాసనం, పద్మాసనం, సూర్య నమస్కారాలు చేయకూడదు.
 
5. గుడ్డు తెల్లసొన తీసుకోవడం మంచిది. ఇది తొడ కండరాలకు బలాన్నిస్తుంది.
 
6. రోజూ కనీసం అర్థగంట సేపు ఎండలో నిలబడటం మంచిది.