గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (12:54 IST)

నిమ్మరసంతో పండ్లు, కూరగాయలను శుభ్రం చేస్తే?

మార్కెట్లలో తెచ్చుకున్న కూరగాయలు, పండ్లను నీటిలో అలా ఇలా కడిగేసి వాడేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకూడదని.. మార్కెట్లో నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను నిమ్మరసం కలిపిన నీటితో కడగాలని వైద్యులు సూచిస్తున

మార్కెట్లలో తెచ్చుకున్న కూరగాయలు, పండ్లను నీటిలో అలా ఇలా కడిగేసి వాడేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకూడదని.. మార్కెట్లో నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను నిమ్మరసం కలిపిన నీటితో కడగాలని వైద్యులు సూచిస్తున్నారు. వెనిగర్‌ అందుబాటులో ఉంటే ఉప్పునీళ్లకు బదులుగా దీన్ని వాడుకోవచ్చు. 
 
ఒక పెద్ద పాత్రలో నాలుగు వంతుల నీళ్లూ, ఒక వంతు వెనిగర్‌ కలపాలి. ఈ మిశ్రమంలో అరగంటసేపు పండ్లూ, కూరగాయల్ని ఉంచాలి. వెనిగర్ లేని పక్షంలో నిమ్మరసం కలిపిన నీటితో పండ్లు, కూరగాయలను కడగటం ద్వారా రసాయనాలు సులువుగా పోతాయి. 
 
అలాగాకుండా.. కొన్ని నీళ్లను వేడిచేసి అందులో రెండు చెంచాల ఉప్పు కలపాలి. నీళ్లు చల్లారాక అందులో అరగంట నుంచి గంటసేపు పండ్లూ, కూరగాయల్ని ఉంచాలి. ఆ తరువాత కుళాయి నీళ్లకింద ఓసారి కడిగితే సరిపోతుంది. ఇలా చేస్తే పండ్లు, కూరగాయలపై వుండే రసాయనాలు సులభంగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.